Squid Game: తెలుగులో స్క్విడ్ గేమ్.. లెక్కకు మించి రికార్డుల టార్గెట్!

ఈ వార్త వింటే మీరు షాక్ అవుతారు.. ఈ లింక్ ఓపెన్ చేస్తే మీరు షేక్ అవుతారు.. ఇదేదో నిజంగానే క్లిక్ చేస్తే మ్యాటర్ ఉండని టాపిక్ కాదు. నిజంగానే వరల్డ్ వైడ్ ఆడియెన్స్ కు షాకిచ్చే..

Squid Game: తెలుగులో స్క్విడ్ గేమ్.. లెక్కకు మించి రికార్డుల టార్గెట్!

Squid Game

Squid Game: ఈ వార్త వింటే మీరు షాక్ అవుతారు.. ఈ లింక్ ఓపెన్ చేస్తే మీరు షేక్ అవుతారు.. ఇదేదో నిజంగానే క్లిక్ చేస్తే మ్యాటర్ ఉండని టాపిక్ కాదు. నిజంగానే వరల్డ్ వైడ్ ఆడియెన్స్ కు షాకిచ్చే సంచలనమే. అవును ఇప్పటికే ఎన్నో రికార్డులను కొల్లగొట్టిన స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్.. ఇప్పుడు మరికొన్ని అప్ డేట్స్ తో ట్రెండింగ్ అవుతోంది.

Bigg Boss 5: సారీ సారీ అంటూనే హగ్గులు.. ముద్దులు.. అరే ఏంట్రా ఇది!

నెట్ ఫ్లిక్స్ లో స్క్విడ్ గేమ్ సృష్టిస్తోన్న సంచలనం మామూలుగా లేదు. జనరల్ గా ఓటీటీ వెబ్ సిరీస్ ల ట్రెండ్ పెరిగాక మన దేశంలోనూ ఫ్యామిలీమ్యాన్, మీర్జాపూర్, స్కామ్ 1992 వంటివి ఫుల్ హైప్ దక్కించుకున్నాయి. అటు నెట్ ఫ్లిక్స్ లో ఇంటర్నేషనల్ సిరీస్ లు మనీ హీస్ట్, డార్క్, స్ట్రైంజర్ థింగ్స్ వంటివి ఓ రేంజ్ లో దూసుకెళ్లాయి. అయితే వీటన్నింటిని వెనక్కి నెట్టి.. ఇవి అందుకోలేని స్జేజ్ కి రీచయింది స్క్విడ్ గేమ్. నెట్ ఫ్లిక్స్ అధికారిక లెక్కల ప్రకారం 1.65 బిలియన్ల వాచ్ అవర్స్ సొంతం చేసుకుంది. అంటే అక్షరాల 1లక్ష 82వేల సంవత్సరాల నిడివితో ఇది సమానం.

OTT Films: తగ్గేదేలే.. వచ్చే వారం ఓటీటీలో రచ్చ రచ్చే!

హాలీవుడ్ భారీ బడ్జెట్ సిరీస్ లను మించి ఓ కొరియన్ డ్రామా లక్షా 82 వేల సంవత్సరాల నిడివితో సమానమైన వాచ్ అవర్స్ ను దక్కించుకోవడం అంటే అది చిన్న విషయం కాదు. ఇంకా ఈ రేంజ్ ను మరింత విస్తరించాలనే ఎయిమ్ తో నెట్ ఫ్లిక్స్ భారీ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటివరకు ఇంగ్లీష్, కొరియన్, హిందీ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉన్న స్క్విడ్ గేమ్…ఇకపై తెలుగు, తమిళ్ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కాబోతుంది. వీటికి సంబంధించిన ట్రైలర్స్ కూడా రీసెంట్గా రిలీజయ్యాయి. దీంతో వ్యూయర్ షిప్ లెక్కకు మించి పెరుగుతుందనే నమ్మకంలో ఉంది నెట్ ఫ్లిక్స్ టీమ్.

Nikki Tamboli: ఫోజులతోనే పిచ్చెక్కించే నిక్కీ!

సెప్టెంబర్‌ 17న నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన ఈ కొరియన్‌ డ్రామాకు యూత్ తో పాటూ సెలబ్రిటీలు సైతం అడిక్ట్‌ అయిపోయారు. అతి తక్కువ టైంలో మోస్ట్‌ వాచ్ డ్ నెట్‌ఫ్లిక్స్‌ సిరీస్‌గా నిలిచింది స్క్విడ్ గేమ్. ఈ సిరీస్ కోసం 160 కోట్ల దాకా పెట్టుబడి పెట్టిన నెట్ ఫ్లిక్స్ గతంలోనే 8వేల కోట్ల ఆదాయాన్ని రాబట్టుకుంది. ఇదింకా అడ్డూ అదుపు లేకుండా భారీగా పెరుగుతూనే ఉంది. రిలీజైన నెలలోనే ఈ సిరీస్ ను 135 మిలియన్లకు పైగానే ప్రేక్షకులు చూసి మరో రికార్డ్ క్రియేట్ చేసారు.

OTT Films: ఈ వారం అరడజను సినిమాలు.. ఫుల్ మీల్స్ ఇస్తున్న ఓటీటీలు!

ఇంకా ఇంకా రికార్డులను సాధించడానికి స్క్విడ్ గేమ్ సీక్వెన్స్ పై భారీ ఎత్తులు వేస్తున్నారు. కంటెంట్ బలంగా ఉంటే జనం ఎగబడి చూస్తారని గ్రహించిన ఈ సిరీస్ టీమ్.. నెక్ట్స్ సిరీస్ కోసం కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. 2023ని టార్గెట్ చేసి.. స్క్విడ్ గేమ్ సీక్వెల్ ప్లాన్స్ హై స్పీడ్ లో జరిగిపోతున్నాయి. ఫస్ట్ సీజన్ కు మించిన డబుల్ ట్రీట్ ఉంటుందని ఇప్పుడే హామీ ఇచ్చేస్తున్నారు మేకర్స్.