Tollywood : క్యాన్సర్‌‌తో పోరాడుతున్న అభిమానితో మాట్లాడిన ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్..అభిమానులు ముద్దుగా పిలుచుకొనే డార్లింగ్ ప్రభాస్..క్యాన్సర్ తో పోరాడుతున్న అభిమానితో ముచ్చటించి సర్ ఫ్రైజ్ ఇచ్చారు.

Tollywood : క్యాన్సర్‌‌తో పోరాడుతున్న అభిమానితో మాట్లాడిన ప్రభాస్

Prabhas

Rebel Star Prabhas : ఆపదలో ఉన్న వారికి చేతనైంత సహాయం చేస్తుంటారు హీరోలు, హీరోయిన్లు. వారిని ఆర్థికంగా ఆదుకోవడమో…వారికి భరోసా ఇవ్వడమో..నేనున్నానంటూ…సహాయం చేస్తారు. స్వచ్చంద సంస్థలకు భారీగా విరాళాలు ఇస్తారు. సినిమాల్లోనే కాక..రియల్ జీవితంలో కూడా దాతృత్వం చూపిస్తుంటారు. తాజాగా..యంగ్ రెబల్ స్టార్..అభిమానులు ముద్దుగా పిలుచుకొనే డార్లింగ్ ప్రభాస్..క్యాన్సర్ తో పోరాడుతున్న అభిమానితో ముచ్చటించి సర్ ఫ్రైజ్ ఇచ్చారు. ప్రభాస్ ఎదురుగా కూర్చొని మాట్లాడంతో ఆ అభిమాని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

Read More : Earn Money : ఊళ్లోనే ఉంటూ డబ్బులు సంపాదించడం ఎలానో తెలుసా ?

కొద్ది రోజుల క్రితం శోభిత అనే అమ్మాయి అనారోగ్యం కారణంగా…హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. క్యాన్సర్ తో పోరాడుతోంది. ఈ సందర్భంగా వైద్యులు ఆమెతో ముచ్చటించారు. ఆమె ఇష్టాలను తెలుసుకున్నారు. సినిమాలు చూస్తానని, ప్రభాస్ అంటే తనకు అభిమానమని చెప్పింది. ఆయనతో మాట్లాడాలని ఉందని చెప్పింది. వెంటనే ఈ విషయాన్ని ప్రభాస్…కు తెలియచేశారు వైద్యులు.

Read More : Ganesh Laddu: మై హోం భూజా, బాలాపూర్ లడ్డూల వేలంలో రికార్డు ధర

ఆమెతో మాట్లాడుతానని ప్రభాస్ చెప్పారు. ఓ రోజు…వీడియో కాల్ ఏర్పాటు చేశారు. ఆమె ఎదుట స్క్రీన్, తదితర ఏర్పాట్లు చేశారు. అనంతరం శోభితను అక్కడ కూర్చొబెట్టారు. అనంతరం స్క్రీన్ పై ప్రభాస్ కనిపించడంతో ఆమె ఆశ్చర్యపోయింది. శోభితతో ముచ్చటించారు ప్రభాస్. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.