Tom Holland – RRR : ఆర్ఆర్ఆర్ పై స్పైడర్ మ్యాన్ కామెంట్స్.. స్పైడర్ మ్యాన్ 4 అప్డేట్ తెలుసా?

స్పైడర్ మ్యాన్ నటుడు టామ్ హాలండ్ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో RRR పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. అలాగే స్పైడర్ మ్యాన్ 4 అప్డేట్ కూడా ఇచ్చాడు.

Tom Holland – RRR : ఆర్ఆర్ఆర్ పై స్పైడర్ మ్యాన్ కామెంట్స్.. స్పైడర్ మ్యాన్ 4 అప్డేట్ తెలుసా?

Tom Holland comments on RRR and update on Spider Man 4

Spider Man Tom Holland : టాలీవుడ్ జక్కన రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా ఇప్పుడు గ్లోబల్ ఫిలిం అయ్యిపోయింది. హాలీవుడ్ సూపర్ హీరో మూవీస్ సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ని అందుకున్నాయో.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కూడా అదే రేంజ్ పాపులారిటీని సొంతం చేసుకుంది. హాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ నుంచి టాప్ స్టార్స్ వరకు ఈ సినిమా చూడని వారు ఉండడం లేదు. ఎన్టీఆర్ (NTR) అండ్ రామ్ చరణ్ (Ram Charan) కలిసి నటించిన ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి.

NTR – Ram Charan : ప్రశాంత్ నీల్‌కి చరణ్ విషెస్.. ఎన్టీఆర్ నాటుకోడి పులుసు ట్రీట్..

ముఖ్యంగా ఎన్టీఆర్ టైగర్స్ తో కలిసి బోన్ లో నుంచి బయటకి వచ్చే సీన్ హాలీవుడ్ ప్రేక్షకులతో పాటు మేకర్స్ కి కూడా గూస్‌బంప్స్ తెప్పించాయి. కాగా ఈ సినిమా గురించి టామ్ హాలండ్ కామెంట్స్ చేశాడు. స్పైడర్ మ్యాన్ చిత్రాలతో మంచి ఫేమ్ ని సంపాదించుకున్న ఈ నటుడు తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో తను చూసిన ఇండియన్ మూవీ ఏంటని ప్రశ్నించారు. దీనికి టామ్ బదులిస్తూ.. “రీసెంట్ గా RRR సినిమా చూశాను. నాకు బాగా నచ్చింది” అంటూ చెప్పుకొచ్చాడు.

Ram Charan : స్నేహితుడు పెళ్లి చేసి రిటర్న్ అయ్యిన రామ్‌చరణ్.. పెళ్ళిలోని చరణ్ ఫొటోలతో మీమ్స్..

ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక టామ్ నటించిన స్పైడర్ సిరీస్ లో ఇప్పటి వరకు మూడు సినిమాలు వచ్చాయి. హోమ్ కమింగ్ (Home coming), ఫార్ ఫ్రమ్ హోమ్ (Far From Home), నో వే హోమ్ (No Way Home).. ఈ మూడు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక నాలుగో సినిమా అప్డేట్ ని కూడా ఈ ఇంటర్వ్యూలో ఇచ్చాడు. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ అయ్యిందని. కానీ ప్రస్తుతం హాలీవుడ్ లో.. వేతనాలు విషయంలో రచయితల సమ్మె జరుగుతుంది. దాని వల్ల స్క్రిప్ట్ వర్క్ కి బ్రేక్ పడినట్లు చెప్పుకొచ్చాడు.