SSMB 28: త్రివిక్రమ్ కొత్త కాంబినేషన్.. మహేష్‌తో అందాల రాక్షసి!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హీరోయిన్స్ ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడు. తన సినిమాలలో హీరోయిన్ అందంగా ఉన్నా హీరో చేత టీజ్ చేయిస్తాడు. ఇప్పటి వరకు త్రివిక్రమ్..

SSMB 28: త్రివిక్రమ్ కొత్త కాంబినేషన్.. మహేష్‌తో అందాల రాక్షసి!

Ssmb 28

SSMB 28: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హీరోయిన్స్ ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడు. తన సినిమాలలో హీరోయిన్ అందంగా ఉన్నా హీరో చేత టీజ్ చేయిస్తాడు. ఇప్పటి వరకు త్రివిక్రమ్ చేసిన హీరోలలో మాగ్జిమమ్ స్టార్ హీరోయిన్స్ నే తీసుకోగా ఇప్పుడు తొలిసారి సూపర్ స్టార్ మహేష్ లాంటి హీరో కోసం ఓ మోస్తరు హీరోయిన్ పేరు పరిశీలించడం హాట్ టాపిక్ గా మారింది.

Samantha : బాలీవుడ్ కాదు.. ఏకంగా హాలీవుడ్‌కి ప్లాన్ చేసిన సమంత

త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ హ్యాట్రిక్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ప్రకటనతో పాటు మహేష్ కు జోడిగా పూజ హెగ్డేను కన్ఫర్మ్ కూడా చేశారు. అయితే, ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉండనున్నారట. అందుకే మరో నాయకిగా నభా నటేష్ పేరు వినిపిస్తూ వచ్చింది. అయితే.. నాభా కాదు లావణ్య త్రిపాఠిని తీసుకోనున్నారని ఇప్పుడు టాక్ మొదలైంది. సెకండ్ హాఫ్ లో సినిమా మొత్తం ట్రావెల్ అయ్యే ఈ పాత్ర కోసం లావణ్యను ఎంపిక చేయడంతో ఈ కొత్త కాంబినేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

Divyavani : ‘బుల్లెట్ బండి’ సాంగ్‌కి స్టెప్స్ ఇరగదీసిన సీనియర్ నటి దివ్యవాణి..

చాలా ఏళ్ల తర్వాత మహేష్ తో త్రివిక్రమ్ మళ్ళీ సినిమా చేయడం.. అరవింద సామెత, అలా వైకుంఠపురం సినిమాల తర్వాత త్రివిక్రమ్ చేసే సినిమా కావడం.. ఈ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే డిసెంబర్ నుండి షూటింగ్ మొదలు పెట్టేందుకు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలవగా మేకర్స్ భారీ తారాగణాన్ని ఎంపిక చేసే పనిలో ఉన్నారట. మరి మహేష్-లావణ్యల కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి.