Rasamayi Balakishan : రసమయి బాలకిషన్ హ్యాట్రిక్ కొడతారా? ఆసక్తికరంగా మానకొండూరు రాజకీయం

టీఆర్ఎస్ నుంచి రెండుసార్లు..మానకొండూరు ఎమ్మెల్యేగా గెలిచిన రసమయి బాలకిషన్ మూడోసారి ఎమ్మెల్యే టికెట్ సాధించి హ్యాట్రిక్ కొడతారా?మారుతున్న మానకొండూరు రాజకీయాల్లో ఏం జరుగుతోంది?!

Rasamayi Balakishan : రసమయి ఇలాకాలో ఏం జరుగుతోందంటే..దీని గురించో చిన్న కారు కథ చెప్పాలి. అదేమంటే..అనగనగా ఒక కారు ఉంది. అది.. మనదే. మన సొంతమేనని 100 కిలోమీటర్ల స్పీడుతో డ్రైవ్ చేస్తున్నాం. కానీ..స్పీడ్ గా దూసుకుపోయే కారుకి బ్రేకులు పడితే జరిగేది ఊహించుకోవటం కాస్త కష్టమే. అటువంటివే రాజకీయాలు కూడా అని అనుకోవాలి. అదేనండీ టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు అని తెలుసు కదా..ఆ కారు టికెట్ గురించే ఈ కథంతా..టీఆర్ఎస్ లో మంచి దూసుకుమీదున్న వ్యక్తి గురించి..అతనే రసమయి బాలకిషన్. ఆయన కారుని సొంత పార్టీలోని తోపు లీడర్లంతా.. అదే కారు డ్రైవ్ చేస్తామంటున్నారు. అయినా.. కూడా కారు స్టీరింగ్ తన చేతుల్లో నుంచి మారదని.. రసమయి చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. కానీ.. ఆయన కారు డ్రైవ్ చేసేది ఇంకో ఏడాది మాత్రమేనని.. తర్వాత ఆ కారు ఎక్కేది.. తొక్కేది.. తానేనని.. ఆరెపల్లి మోహన్ చెబుతుండటంపై.. హాట్ డిబేట్ నడుస్తోంది. ఇంతకీ.. మానకొండూరులో జరుగుతున్నదేంటి?

Also read : Bhatti Vikramarka : భట్టి విక్రమార్క పాదయాత్రలో కండువాల రచ్చ..రానున్న ఎన్నికల్లో పొత్తులపై హాట్ హాట్ చర్చ…

తెలంగాణ ఉద్యమాన్ని.. పాటలతో ఉర్రూతలూగించిన కళాకారుడు, టీఆర్ఎస్ నుంచి రెండుసార్లు.. మానకొండూరు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు, తెలంగాణ సాంస్కృతిక సారథిగా.. రెండోసారి కూడా కొనసాగుతున్న అదృష్టవంతుడు. అన్నీ.. రసమయి బాలకిషన్ ఒక్కడే. వీటన్నింటితో.. రాజకీయంగా రసమయి హ్యాపీగానే ఉన్నారు. కానీ.. ఆయన ఆశించిన మంత్రి పదవి దక్కకపోవడంపైనే.. ఆయన అప్పుడప్పుడు ఫీల్ అవుతుంటారని.. బాలకిషన్ సన్నిహిత వర్గాలు చెబుతుంటాయ్.

ఇదంతా పక్కనబెట్టి.. అసలు మేటర్‌లోకి వెళితే.. మానకొండూరులో బలమైన ప్రత్యర్థి లేకపోవడం, ఉన్న ఒక్కరూ.. టీఆర్ఎస్‌లో చేరడం రసమయికి బాగా కలిసొచ్చింది. అయితే.. సొంత పార్టీలోనే.. ఆయనకు పోటీ ఇచ్చేందుకు కొందరు నాయకులు రెడీ అవుతుంటే.. రసమయి మాత్రం వచ్చే ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. ఇందుకు.. నియోజకవర్గంలో మారిన రాజకీయ పరిస్థితులే కారణమని కేడర్‌లో చర్చ జరుగుతోంది. గత రెండు ఎన్నికల్లో.. బాలకిషన్‌పై.. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ఆరెపల్లి మోహన్.. మారిన రాజకీయ పరిణామాలతో.. టీఆర్ఎస్ గూటికి చేరారు. దీంతో.. రసమయికి.. నియోజకవర్గంలో బలమైన ప్రత్యర్థి లేకుండా పోయారు.

తనను ఢీకొట్టే లీడర్ లేరని.. రసమయి రిలాక్స్ అవుతున్న టైంలో.. సొంత పార్టీ నుంచే సెగ మొదలైంది. ప్రత్యర్థి ఉన్నది పక్క పార్టీల్లో కాదు.. సొంత పార్టీలోనే అని బాలకిషన్‌కు ఈ మధ్యే అర్థమైంది. గతంలో తనపై పోటీ చేసిన ఆరెపల్లి మోహన్.. టీఆర్ఎస్‌లో చేరి.. తన సీటుకే ఎసరు పెడుతున్నారని.. రసమయి గ్రహించి.. అలర్ట్ అయిపోయారు. అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవ్వాలని.. బాలకిషన్, ఆరెపల్లి మోహన్ ఉవ్విళ్లూరుతున్నారు. మోహన్ కూడా టికెట్ ఆశిస్తుండటంతో.. ఇద్దరిలో అధిష్టానం ఎవరి వైపు మొగ్గుతుందన్నది.. ఆసక్తిగా మారింది. ఈసారి కూడా టికెట్ బాలకిషన్ అన్నకే వస్తుందని.. ఆయన అనుచరులు, కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. ఆరెపల్లి మోహన్ విషయానికొస్తే.. గులాబీ పార్టీ నుంచి టికెట్ దక్కకపోతే.. కాంగ్రెస్, బీజేపీలో.. ఏదో ఒక దాంట్లో చేరే అవకాశం ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయ్.

Also read : Congress Highcommand Serious : భట్టి విక్రమార్క ఛాంబర్‌లో జేసి ఎపిసోడ్‌పై హైకమాండ్ సీరియస్

మానకొండూరులో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలవాలని చూస్తున్న రసమయి బాలకిషన్.. ఇప్పటి నుంచే నియోజకవర్గ రాజకీయాలపై పక్కాగా లెక్కలు వేసుకుంటున్నారు. నిత్యం.. ప్రజల్లే ఉండేలా కార్యక్రమాలు రూపొందించుకోవడం, ఉదయాన్నే.. ఏదో ఒక గ్రామానికి వెళ్లడం.. అక్కడ జనంతో మమేకమై.. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై చర్చించి.. అర్హులైన వారికి అందిస్తున్నారు. ఎవరికేమి కావాలన్నా.. కాదనకుండా చేస్తూ.. అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టారు.

రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కాబట్టి.. ఓన్ ఇమేజ్ బెస్ట్ ఇన్ పాలిటిక్స్ అనే సూత్రాన్ని నమ్ముకున్నారు. అందువల్ల.. ఎన్నికలకు నెలల ముందు నుంచే.. జనంలో తన ఇమేజ్ బిల్డప్ చేసుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు రసమయి బాలకిషన్.

ట్రెండింగ్ వార్తలు