Adipurush: ట్వీట్ మిస్టేక్.. సన్నీపై ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం!

సోషల్ మీడియాలో ఒక్కోసారి చిన్న పొరపాటు కూడా పెద్ద తప్పు అయిపోతుంది. అది కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల విషయంలో ఇది మరీ పెద్ద తప్పుగా మారిపోతుంది. తాజాగా బాలీవుడ్ నటుడు..

Adipurush: ట్వీట్ మిస్టేక్.. సన్నీపై ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం!

Adipurush

Adipurush: సోషల్ మీడియాలో ఒక్కోసారి చిన్న పొరపాటు కూడా పెద్ద తప్పు అయిపోతుంది. అది కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల విషయంలో ఇది మరీ పెద్ద తప్పుగా మారిపోతుంది. తాజాగా బాలీవుడ్ నటుడు సన్నీసింగ్ విషయంలో కూడా అదే జరిగింది. ఆదిపురుష్ లో ప్రభాస్ రాముడిగా నటిస్తుంటే బాలీవుడ్‌ నటుడు సన్నీసింగ్‌ లక్ష్మణుడిగా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌లో ప్రభాస్‌తో సన్నీకి మంచి బాండింగ్‌ ఏర్పడింది. ఇదే విషయాన్ని సన్నీ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

Samantha: సామ్‌కు అరుదైన గౌరవం.. తొలి సౌత్ నటిగా గుర్తింపు!

ప్రభాస్‌తో దిగిన ఫొటోను షేర్‌ చేసిన సన్నీ ‘పెద్దన్నతో పని చేయడం గొప్పగా ఉంది. మా ఫ్రెండ్‌షిప్‌ ఎప్పటికి కొనసాగుతుంది’ అని ట్వీట్‌లో రాసుకోస్తూ ప్రభాస్‌ పేరుతో ఉన్న ట్విటర్‌ అకౌంట్‌ను ట్యాగ్‌ చేశాడు. ఇదే సన్నీ కొంపముంచింది. ఎందుకంటే ప్రభాస్ కు ట్విట్టర్ అఫీషియల్ ఖాతా లేదు. పేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లాంటి సోషల్ ఖాతాలున్నాయి కానీ ట్విట్టర్ లో అకౌంట్ లేదు. కానీ సన్నీ మాత్రం ప్రభాస్ పేరుతో ఉన్న ఖాతాను ట్యాగ్ చేస్తూ ప్రభాస్ తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు.

Adipurush: ప్రమోషన్ కోసం కొత్త పంథా.. సిద్దమవుతున్న స్పెషల్ సాంగ్!

ఈ ట్వీట్ చూసిన అభిమానులు కొందరు అతడిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంతచిన్న విషయం కూడా తెలుసుకోకుండా ఎలా ట్వీట్ చేసావ్ బ్రో అంటూ కామెంట్ల మోత మోగించారు. అయితే, ఆ తర్వాత అసలు విషయం తెలుసుకున్న సన్నీ సింగ్‌ ఆ ట్వీట్‌ను తొలగించగా.. అదే పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. సినిమా విషయానికి వస్తే.. ప్రభాస్‌ రాముడి పాత్ర పోషిస్తుండగా కృతి సనన్‌ సీతగా నటిస్తోంది. ఇక సన్నీ సింగ్‌ లక్ష్మణుడిగా కనిపించబోతుంటే.. సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడుగా కనిపిస్తున్నాడు.