Priyanka Singh : ‘జబర్దస్త్’ సాయి తేజ నుంచి ‘బిగ్ బాస్ 5’ ప్రియాంక సింగ్ వరకు..

‘బిగ్ బాస్ 5’ కంటెస్టెంట్ ప్రియాంక సింగ్ పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కి సంబంధించిన ఆసక్తికర విషయాలు..

Priyanka Singh : ‘జబర్దస్త్’ సాయి తేజ నుంచి ‘బిగ్ బాస్ 5’ ప్రియాంక సింగ్ వరకు..

Priyanka Singh

Priyanka Singh: సాధారణంగా జీవితంలో ఏదైనా ఒక ఫీల్డ్‌ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అందులో రాణించడానికి, గుర్తింపు తెచ్చుకోవడానికి కృషి, పట్టుదల, క్రమశిక్షణ అనేవి చాలా అవసరం. కష్టపడితే అనుకున్నది సాధించడం పెద్ద కష్టమేమి కాదు. అయితే అందరిలా కాకుండా ట్రాన్స్ జెండర్స్‌కి సొసైటీలో బ్రతకడం, తాము అనుకున్న రంగంలో గుర్తింపు తెచ్చుకోవడం అనేవి అంత సులభం కాదు. కానీ తాను అనుకున్నది సాధించడంతో పాటు ఎంతోమందికి స్పూర్తిగా నిలిచింది ‘జబర్దస్త్’ సాయి తేజ అలియాస్ ప్రియాంక సింగ్..

Sai Teja

‘జబర్దస్త్’ షో లో లేడీ గెటప్స్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న సాయి తేజ.. ఇప్పుడు ‘బిగ్ బాస్ 5’ లో పార్టిసిపెట్ చేస్తుంది. చిన్నతనం నుంచి తండ్రి వ్యతిరేకించడం.. కష్టపడి ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోకి ఎంటర్ అవడం, లింగ మార్పిడి సర్జరీ, అనారోగ్య సమస్యలు, మెగా బ్రదర్ నాగబాబు సాయం చెయ్యడం.. ఇప్పుడు ‘బిగ్ బాస్’ హౌస్‌‌లోకి వెళ్లడం.. ఇలా సాయి తేజ, ప్రియాంక సింగ్ వరకు మారడం వెనుక ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలున్నాయి.. అవేంటో చూద్దాం..

Bigg Boss 5 Telegu : అనీ మాస్టర్‌తో జెస్సీ ఫైటింగ్.. రవిని పట్టుకుని ఏడ్చేసిన విశ్వ..

Jabardasth Sai Teja

తండ్రి వ్యతిరేకత.. వేదికపై కంటతడి..
హైదరబాద్‌కు చెందిన సాయి తేజతో కలిపి వారి తల్లిదండ్రులకు ముగ్గురు సంతానం. హర్మోన్ల కారణంగా సాయి తేజ శరీరంలో మార్పులు చోటు చేసుకోవడంతో తల్లి సపోర్ట్‌గా ఉన్నప్పటికీ తండ్రి మాత్రం వ్యతిరేకించారు. ‘బిగ్ బాస్ 5’ ప్రీమియర్ ఎపిసోడ్‌లో ఇప్పటికైనా నన్ను మీ బిడ్డగా యాక్సెప్ట్ చెయ్యండి డాడీ అంటూ ప్రియాంక సింగ్ కంటతడి పెడుతూ తన తండ్రికి విజ్ఞప్తి చెయ్యడం చూసి అంతా ఎమోషనల్ అయ్యారు.

Priyanka Singh Parents

Bigg Boss 5 Telugu : నాగార్జునతో సహా కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్ ఎంతంటే..!

‘జబర్దస్త్’ లో లేడీ గెటప్స్..
ఈ పాపులర్ కామెడీ షో లో ముందుగా లేడీ గెటప్స్ వెయ్యడానికి అవకాశం వచ్చింది. తర్వాత టిక్ టాక్ వీడియోలతోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తోటి ఆర్టిస్టులు, టిక్ టాక్ ఫ్రెండ్స్ అంతా అండగా నిలబడడంతో సర్జరీ చేయించుకోవడానికి ధైర్యం లభించింది..

Bigg Boss 5 Contestant Priyanka Singh

మెగా బ్రదర్ నాగబాబు సపోర్ట్..
సర్జరీ చేయించుకున్న తర్వాత సాయి తేజకు పలు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ‘జబర్దస్త్’ నుండి బ్రేక్ తీసుకుంది. దీంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడింది. అప్పుడు ‘జబర్దస్త్’ కి జడ్జిగా వ్యవహరిస్తున్న మెగాబ్రదర్ నాగబాబు తన పరిస్థితి తెలుసుకుని.. పూర్తి ఆరోగ్యంగా కోలుకునే వరకు అవసరమైన ఆర్థికసాయం చేశారు..

Nagababu

తమన్నా తర్వత ప్రియాంకనే..
‘బిగ్ బాస్ 4’ లో పాల్గొన్న ఫస్ట్ ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి. ఈ షో లో పాల్గొనడంతో తనకు మంచ గుర్తింపు లభించింది. ఆమె తర్వాత ‘బిగ్ బాస్ 5’ లో పార్టిసిపెట్ చేస్తున్న సెకండ్ ట్రాన్స్ జెండర్ ప్రియాంకనే కావడం విశేషం. ‘బిగ్ బాస్’ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుని, వారి ఓటింగ్స్ ద్వారా విజేతగా నిలుస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేస్తోంది సాయి తేజ అలియాస్ ప్రియాంక సింగ్..

Priyanka Singh