Unstoppable 2: సర్‌ప్రైజ్ ఇస్తోన్న డార్లింగ్.. ఆహా అంటోన్న అభిమానులు.. న్యూ ఇయర్ వేడుకలు ముందుగానే స్టార్ట్!

నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ 2 షో లేటెస్ట్ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఎప్పుడూ ఈ రేంజ్‌లో ఎదురుచూసింది లేదు. అంతగా ఈ టాక్ షోలోని కొత్త ఎపిసోడ్ కోసం యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి కారణం.. ఈ ఎపిసోడ్‌లో సందడి చేయబోతున్నది మరెవరో కాదు.. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా హిస్ట్రరీని నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లిన స్టార్ హీరో ప్రభాస్.

Unstoppable 2: సర్‌ప్రైజ్ ఇస్తోన్న డార్లింగ్.. ఆహా అంటోన్న అభిమానులు.. న్యూ ఇయర్ వేడుకలు ముందుగానే స్టార్ట్!

Unstoppable 2 Prabhas Episode To Be Streamed Today Night

Unstoppable 2: నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ 2 షో లేటెస్ట్ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఎప్పుడూ ఈ రేంజ్‌లో ఎదురుచూసింది లేదు. అంతగా ఈ టాక్ షోలోని కొత్త ఎపిసోడ్ కోసం యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి కారణం.. ఈ ఎపిసోడ్‌లో సందడి చేయబోతున్నది మరెవరో కాదు.. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా హిస్ట్రరీని నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లిన స్టార్ హీరో ప్రభాస్.

Unstoppable 2: అన్‌స్టాపబుల్-2 బాహుబలి ఎపిసోడ్ స్పెషల్ ప్రోమో.. అదిరిపోయింది!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అన్‌స్టాపబుల్ 2 టాక్ షోలో వస్తున్నాడని తెలిసినప్పటి నుండీ.. ఈ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇక అభిమానులను ఆకట్టుకునేందుకు ఈ టాక్ షో నిర్వాహకులు, ఇప్పటికే పలు పోస్టర్స్, ప్రోమోలను రిలీజ్ చేశారు. అయితే ఈ బాహుబలి ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా డిసెంబర్ 30న, జనవరి 6న స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఆహా ప్రకటించింది. కానీ, డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కోరిక మేరకు ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ఫస్ట్ పార్ట్‌ను డిసెంబర్ 29న రాత్రి 9 గంటలకే స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు నిర్వాహకులు తాజాగా వెల్లడించారు.

Unstoppable 2 : ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌ థియేటర్‌లో విడుదల కానుందా.. వైరల్ అవుతున్న ట్వీట్!

ఇలా అభిమానులను ప్రభాస్ సర్‌ప్రైజ్ చేయడమే కాకుండా, ఈ ఎపిసోడ్‌తో ఓటీటీ రికార్డులకు ఎసరుపెట్టడం ఖాయమని నిర్వాహకులు భావిస్తున్నారు. ఇక ఈ ఎపిసోడ్‌లో బాలయ్య ప్రభాస్‌తో పాటు మరో హీరో గోపీచంద్‌తో ఎలాంటి సందడి చేస్తాడా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ఓ టాక్ షోలో ప్రభాస్ చాలా రోజుల తరువాత పాల్గొనడంతో అందరూ అన్‌స్టాపబుల్ 2 కోసం ఆసక్తిగా చూస్తున్నారు.