Unstoppable 2: అన్‌స్టాపబుల్-2 బాహుబలి ఎపిసోడ్ స్పెషల్ ప్రోమో.. అదిరిపోయింది!

నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ప్రెస్టీజియస్ టాక్ షో ‘అన్‌స్టాపబుల్ 2’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేసింది. తొలి సీజన్ కంటే కూడా ఇప్పుడు ఈ టాక్ షో కోసం అందరు హీరోల అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. దీనికి రెండు బలమైన కారణాలు ఉన్నాయి. ఈ టాక్ షోలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పాల్గొనడంతో ఒక్కసారిగా అన్‌స్టాపబుల్ టాక్ షో కోసం అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Unstoppable 2: అన్‌స్టాపబుల్-2 బాహుబలి ఎపిసోడ్ స్పెషల్ ప్రోమో.. అదిరిపోయింది!

Unstoppable 2 Prabhas Episode New Promo

Unstoppable 2: నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ప్రెస్టీజియస్ టాక్ షో ‘అన్‌స్టాపబుల్ 2’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేసింది. తొలి సీజన్ కంటే కూడా ఇప్పుడు ఈ టాక్ షో కోసం అందరు హీరోల అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. దీనికి రెండు బలమైన కారణాలు ఉన్నాయి. ఈ టాక్ షోలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పాల్గొనడంతో ఒక్కసారిగా అన్‌స్టాపబుల్ టాక్ షో కోసం అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Unstoppable 2 : నారి నారి నడుమ నందమూరి.. అన్‌స్టాపబుల్ కొత్త గెస్ట్‌లు వేరే..

అయితే ప్రభాస్ పాల్గొన్న ఈ టాక్ షో ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఆహా ఇప్పటికే ప్రకటించింది. కాగా, తాజాగా ఎపిసోడ్-1కి సంబంధించిన ప్రోమోను ఎట్టకేలకు ఆహా రిలీజ్ చేసింది. ఈ ప్రోమో ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునేలా కట్ చేశారు షో నిర్వాహకులు. బాలయ్య ప్రభాస్‌ల మధ్య సరదా సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ‘‘నువ్వు డార్లింగ్ అంటే దెయ్యాలు కూడా దేవతలుగా మారిపోతాయి’’ అంటూ బాలయ్య ప్రభాస్‌ను ర్యాగ్ చేయడం.. ‘‘నేను కూడా నీ మాయలో పడిపోయాను’’ అని బాలయ్య అనడం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి.

Unstoppable 2: అన్‌స్టాపబుల్ 2 ప్రోమో.. ప్రభాస్‌లోని అన్ని ఎమోషన్స్‌ను బయటపెట్టిన బాలయ్య

ఇక పెళ్లెప్పుడు అని మరోసారి బాలయ్య ప్రశ్నించగా, రాసి పెట్టిలేదేమో సార్ అంటూ ప్రభాస్ చెబితే.. మీ అమ్మకు చెప్పే కారణాలు నాకు చెప్పొద్దంటూ బాలయ్య కామెంట్ చేశారు. కాగా, మరో హీరో గోపీచంద్‌తో 2008లో ఒక హీరోయిన్ విషయంలో మీ ఇద్దరు గొడవపడ్డారా అని బాలయ్య అడగ్గా, అది 2008 కాదనుకుంటా సార్ అని గోపీచంద్ బదులిచ్చాడు. ఇక ఎపిసోడ్‌లో భాగంగా, బాలయ్య మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు ఫోన్ చేసి, సంక్రాంతికి ముందుగా తన సినిమా చూడాలని.. ఆ తరువాతే చిరంజీవిగారి సినిమా చూడాలంటూ చెప్పుకొచ్చాడు. దీంతో పక్కనే ఉన్న ప్రభాస్ ఒక్కసారిగా నవ్వుకున్నాడు. ఇలా సరదా ఎలిమెంట్స్‌తో కట్ చేసిన అన్‌స్టాపబుల్ 2 బాహుబలి ఎపిసోడ్-1 ప్రోమో మాత్రం అదిరిపోయిందని అభిమానులు అంటున్నారు.