Upasana : సమాజం కోరుకున్నప్పుడు కాదు నేను కావాలనుకున్నప్పుడు తల్లినవుతున్నాను..

ప్రస్తుతం ఉపాసన ప్రగ్నెంట్. ఆల్మోస్ట్ పెళ్లయిన 10 ఏళ్ళ తర్వాత ఉపాసన ప్రగ్నెంట్ అయింది. ప్రెగ్నెన్సీ విషయంలో ఇంత లేట్ ఎందుకు అనే దానిపై ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపింది ఉపాసన.

Upasana : సమాజం కోరుకున్నప్పుడు కాదు నేను కావాలనుకున్నప్పుడు తల్లినవుతున్నాను..

Upasana comments on her pregnancy (Photo: Instagram)

Upasana :  రామ్ చరణ్(Ram Charan) భార్యగానే కాక ఉపాసన(Upasana) అపోలో(Apollo) సంస్థ ద్వారా, ఓ బిజినెస్ వుమెన్ గా, తాను చేసే మంచి పనులతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. పెళ్ళైన కొత్తలో ఎక్కువగా బయటకు, మీడియా ముందుకు రాకపోయినా ఇప్పుడు మాత్రం ఉపాసన రెగ్యులర్ గా సోషల్ మీడియాలో(Social Media) యాక్టివ్ గా ఉంటుంది. చరణ్, ఉపాసన జంట ఇటీవల ఎక్కువగా ట్రిప్స్ కి వెళ్లడం, RRR సినిమా విదేశీ ప్రమోషన్స్ లో ఉపాసన కూడా వెళ్లడంతో ఈ జంట బాగా వైరల్ అయ్యారు.

ప్రస్తుతం ఉపాసన ప్రగ్నెంట్. ఆల్మోస్ట్ పెళ్లయిన 10 ఏళ్ళ తర్వాత ఉపాసన ప్రగ్నెంట్ అయింది. ప్రెగ్నెన్సీ విషయంలో ఇంత లేట్ ఎందుకు అనే దానిపై ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపింది ఉపాసన.

Upasana : అందంగా లేనని ట్రోల్ చేశారు.. డబ్బు కోసమే చరణ్ నన్ను పెళ్లి చేసుకున్నాడని అన్నారు.. ఉపాసన సంచలన వ్యాఖ్యలు..

ఉపాసన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సమాజం కోరుకున్నప్పుడు కాదు నేను తల్లిని కావాలనుకున్నప్పుడు ప్రెగ్నెంట్ అవ్వడం ఆనందంగా, గర్వంగా ఉంది. నేను, చరణ్ ముందే అనుకున్నాం. పెళ్లయిన పదేళ్ల తర్వాతే మేము బిడ్డని కనాలనుకున్నాం. మేమిద్దరం మా రంగాల్లో బాగా ఎదగాలి, ఆర్ధికంగా మరింత బలోపేతం అవ్వాలి అనుకున్నాం. మా పిల్లలకి కావాల్సినవి అన్ని సొంతంగా ఇచ్చే స్థాయికి వెళ్ళాలి అనుకున్నాం. అందుకే ప్రెగ్నెన్సీ ఇప్పుడు ప్లాన్ చేసుకున్నాం. సమాజం, బంధువులు, తెలిసిన వాళ్ళు చాలా మంది ఈ పదేళ్ల నుండి నా ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. కానీ వాళ్ళ మాటలకు మేము తలొంచలేదు. మా ఇద్దరి మధ్య బలమైన బంధం ఉంది. మేము కావాలనుకున్నప్పుడే తల్లితండ్రులవుతున్నాం అని తెలిపింది.