Upasana : అందంగా లేనని ట్రోల్ చేశారు.. డబ్బు కోసమే చరణ్ నన్ను పెళ్లి చేసుకున్నాడని అన్నారు.. ఉపాసన సంచలన వ్యాఖ్యలు..

తాజాగా ఉపాసన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను తెలిపింది. తనపై, చరణ్ పై వచ్చిన ట్రోల్స్ గురించి కూడా మాట్లాడింది.

Upasana : అందంగా లేనని ట్రోల్ చేశారు.. డబ్బు కోసమే చరణ్ నన్ను పెళ్లి చేసుకున్నాడని అన్నారు.. ఉపాసన సంచలన వ్యాఖ్యలు..

Upasana comments on trolls during her wedding with Charan

Updated On : April 2, 2023 / 3:34 PM IST

Upasana :  రామ్ చరణ్ భార్యగానే కాక ఉపాసన అపోలో సంస్థ ద్వారా, తాను చేసే మంచి పనులతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. పెళ్ళైన కొత్తలో ఎక్కువగా బయటకు, మీడియా ముందుకు రాకపోయినా ఇప్పుడు మాత్రం ఉపాసన రెగ్యులర్ గా ఏదో ఒక మంచి వార్తతోనే రెగ్యులర్ గా వార్తల్లో నిలుస్తుంది. ప్రస్తుతం ఉపాసన ప్రగ్నెంట్ కూడా. చరణ్, ఉపాసన జంట ఇటీవల ఎక్కువగా ట్రిప్స్ కి వెళ్లడం, RRR సినిమా విదేశీ ప్రమోషన్స్ నో ఉపాసన కూడా వెళ్లడంతో ఈ జంట బాగా వైరల్ అయ్యారు.

తాజాగా ఉపాసన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను తెలిపింది. తనపై, చరణ్ పై వచ్చిన ట్రోల్స్ గురించి కూడా మాట్లాడింది. ఉపాసన మాట్లాడుతూ.. ఓ కామన్ ఫ్రెండ్ వల్ల చరణ్, నేను ఫ్రెండ్స్ అయ్యాం. ఆ తర్వాత మరింత క్లోజ్ అయి ప్రేమలో పడ్డాం. మా స్నేహం మొదలైనప్పటి నుంచి ఒకరికి ఒకరం సపోర్ట్ చేసుకుంటూనే ఉన్నాం. చరణ్ తో పెళ్లి విషయంలో మా ఆంటీ, సోదరి చాలా హెల్ప్ చేశారు.

Samantha : అవి నా చీకటి రోజులు.. మరోసారి విడాకుల విషయంపై మాట్లాడిన సమంత..

చిన్నప్పటినుంచి అన్ని విషయాల్లోనూ కొంతమంది నన్ను జడ్జ్ చేస్తూనే ఉండేవారు. చరణ్ కి భార్యగా మారిన తర్వాత మొదట్లో నేను అందంగా లేనని, లావుగా ఉన్నానని, చరణ్ డబ్బుల కోసమే నన్ను పెళ్లి చేసుకున్నాడని ట్రోల్స్ చేశారు. ఇలాంటి విమర్శలు చేసిన వాళ్ళని నేను ఏమి అనదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్లకు నా గురించి ఏమి తెలియదు. కానీ ఈ గడిచిన పదేళ్లలో వారికి నా గురించి తెలిసింది. ఇప్పుడు నాపై చాలామందికి అభిప్రాయం మారిపోయింది. విమర్శలు మనం తీసుకునే విధానంలోనే ఉంటుంది. ట్రోల్స్ వచ్చినప్పుడు నేను బాధపడలేదు, పట్టించుకోలేదు. ఇప్పుడు నా విషయంలో నేను చాలా ఆనందంగా ఉన్నా. ఇవాళ నేనొక ఛాంపియన్ అని ఫీల్ అవుతున్నా. అలాంటి చాలా విమర్శలని నేను ధైర్యంగా ఎదుర్కొన్నాను అని తెలిపింది. దీంతో ఉపాసన చేసిన వ్యాఖ్యలు సంచనలంగా మారాయి.