Ranga Ranga Vaibhavanga ఫస్ట్‌ సింగిల్‌.. తెలుసా తెలుసా ఎవరికోసం ఎవరు పుడతారో!

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

Ranga Ranga Vaibhavanga ఫస్ట్‌ సింగిల్‌.. తెలుసా తెలుసా ఎవరికోసం ఎవరు పుడతారో!

Ranga Ranga Vaibhavanga

Updated On : February 3, 2022 / 8:28 PM IST

Ranga Ranga Vaibhavanga: మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తరువాత కొండపోలం సినిమాతో డిఫరెంట్ జోనర్ లో ప్రయత్నించినా వైష్ణవ్ ఇప్పుడు ‘రంగరంగ వైభవంగా’ రాబోతున్నాడు. గిరీశాయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వైష్ణవ్ కి జోడీగా కేతికా శర్మ నటిస్తుంది.

OTT Platforms: ఓటీటీల పోటీ.. స్ట్రీమింగ్ రైట్స్ కోసం కాంపిటీషన్

బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా తెలుసా తెలుసా అనే ఫస్ట్‌ సింగిల్‌ను విడుదల చేశారు. ‘తెలుసా తెలుసా ఎవరికోసం ఎవరు పుడతారో.. ఎవరికి ఎవరేమి అవుతారో’ అంటూ సాగే ఈ పాటను శంకర్ మహదేవన్ తన గాత్రంతో ప్రాణం పోశారు. దేవీశ్రీ ప్రసాద్‌ మరోసారి యూత్ కి నచ్చేలా ఈ సినిమా కోసం మ్యూజిక్ అందించినట్లు ఈ పాటను వింటేనే అర్ధం అవుతుంది.

Films Releases: పెద్ద సినిమాలున్నా.. తగ్గేదేలే అంటున్న చిన్న సినిమాలు!

పూర్తి యూత్ ఫుల్, రొమాంటిక్ కంటెంట్ తో రాబోతున్న ఈ సినిమాకు కేతికా గ్లామర్ ప్లస్ కానుండగా ఈ సినిమా విడుదల ఎప్పుడన్నది త్వరలోనే ప్రకటించనున్నారు.