OTT Platforms: ఓటీటీల పోటీ.. స్ట్రీమింగ్ రైట్స్ కోసం కాంపిటీషన్

తెలుగు సినిమాల మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది. అందుకే నేషనల్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ కూడా తెలుగు సినిమాల స్ట్రీమింగ్ రైట్స్ కోసం పోటీ పడుతున్నాయి.

OTT Platforms: ఓటీటీల పోటీ.. స్ట్రీమింగ్ రైట్స్ కోసం కాంపిటీషన్

Ott

OTT Platforms: తెలుగు సినిమాల మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది. అందుకే నేషనల్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ కూడా తెలుగు సినిమాల స్ట్రీమింగ్ రైట్స్ కోసం పోటీ పడుతున్నాయి. ధియేటర్లు లేని టైమ్ లో ఆడియన్స్ ని ఎంగేజ్ చేసి విపరీతమైన వ్యూయర్ షిప్ ని సొంతం చేసుకున్న టాప్ ఓటీటీలు.. ఇప్పుడు టాప్ తెలుగు సినిమాలు మాకు కావాలంటే మాకు కావాలి అంటూ పోటీపడుతున్నాయి.

Ante Sundaraniki: నానీ సినిమాకి ఏడు రిలీజ్ డేట్స్.. పెద్ద చిక్కే!

నేషనల్ లెవల్ ఓటీటీల్లో ఎప్పుడూ లేనంతగా తెలుగు సినిమాల హవా నడుస్తోంది. అందుకే టాప్ ఓటీటీలైన అమెజాన్, నెట్ ఫ్లిక్స్, డిస్నీ, జీ, ఆహా లాంటి టాప్ ఓటీటీలు తెలుగు మూవీ రైట్స్ కోసం విపరీతంగా పోటీపడుతున్నాయి. తెలుగు సినిమా మార్కెట్ తో పాటు తెలుగు సినిమాకి రీచింగ్ కూడా పెరగడంతో ఓటీటీల మధ్య స్ట్రీమింగ్ రైట్స్ కోసంవిపరీతమైన కాంపిటీషన్ నడుస్తోంది.

Allu Arjun Twitter: తగ్గేదేలే.. రజినీని మించిపోయిన బన్నీ!

తెలుగు సినిమాలకు ఎప్పుడూ లేనివిధంగా ఓటీటీల్లో విపరీతంగా కాంపిటీషన్ పెరిగిపోతోంది. ఓటీటీ వ్యూయర్ షిప్ పెరగడంతో స్టార్ హీరోల సినిమాల్ని తమ ప్లే లిస్ట్ లో ఉంచడానిక ఎన్ని కోట్లు స్పెండ్ చెయ్యడానికైనా రెడీ అవుతున్నారు. ఇండియాస్ మోస్ట్ అవెయిటింగ్ మూవీ ట్రిపుల్ఆర్ కి సంబంధించి ఓటీటీ రైట్స్ కోసం విపరీతంగా కాంపిటీషన్ జరిగింది. ఆఖరికి జీ ఓటీటీ ట్రిపుల్ ఆర్ ని దక్కించుకుంది. అసలు ఓ టైమ్ లో ఓటీటీలోనే డైరెక్ట్ రిలీజ్ కోసం పోటీ పడ్డాయి టాప్ ఓటీటీలు.

Unstoppable with NBK స్పెషల్ ప్రోమో.. ఇంత యంగ్ గా ఉన్నావేంటయ్యా బాబు!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ కూడా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుండడంతో 400కోట్లకు నెట్ ఫ్లిక్స్ ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేసుకుంది అంటూ విపరీతంగా న్యూస్ నడిచింది. అంతేకాదు.. ఓటీటీ రిలీజ్ విషయంలో అమెజాన్ కి, నెట్ ఫ్లిక్స్ కి మధ్య గట్టి పోటీ నడిచింది. ప్రభాస్ కి సౌత్, నార్త్ లోనే కాకుండా ఇంటర్నేషనల్ వైడ్ ఫాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఆ ఆడియన్స్ ని కూడా గ్రాబ్ చెయ్యడానికి రాధేశ్యామ్ రైట్స్ కోసం పోటీపడ్డాయి ఓటీటీ లు.

Lahari Shari: డోస్ పెంచేసిన బిగ్ బాస్ భామ లహరి!

పుష్ప సినిమాతో ఓటీటీ వ్యూయర్ షిప్ లో ఫస్ట్ ప్లేస్ సంపాదించుకున్న అమెజాన్ ప్రైమ్.. ఆ రికార్డ్ ని సస్టెయిన్ చేస్కోడానికి మోస్ట్ ఇంట్రస్టింగ్ స్టార్ సినిమాల్ని కూడా తన లిస్ట్ లో యాడ్ చేసేసుకుంది. మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో పాటు, చిరంజీవి, రామ్ చరణ్ మల్టీస్టారర్ ఆచార్య, మరో క్రేజీ మూవీ కెజిఎఫ్ 2 సినిమాలకు సంబంధించి రైట్స్ ని కొనేసుకుంది.

Telugu Movies Releases: సమ్మర్ లో హీటెక్కించబోతున్న సినిమా జాతర

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, క్రాక్, లవ్ స్టోరీ లాంటి క్రేజీ మూవీస్ తో తెలుగు ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తున్న అచ్చతెలుగు ఓటీటీ యాప్ కూడా ఎప్పటిక ప్పుడు ఫ్రెష్ కంటెంట్ తో వస్తోంది. ప్రతి శుక్రవారం థియేటర్లో సినిమాలు ఎలా రిలీజ్ అవుతాయో.. ఆహాలో కూడా ఎవ్రీ ఫ్రైడే కొత్త సినిమాల్ని ఆడియన్స్ కి అందిస్తోంది. ఇలా ఓటీటీలు ఎప్పుడూ లేనంతగా తెలుగు సినిమాల కోసం కోట్లు ఆఫర్ చేస్తూ.. స్ట్రీమింగ్ రైట్స్ కోసం విపరీతంగా పోటీపడుతున్నాయి.