Telugu Movies Releases: సమ్మర్ లో హీటెక్కించబోతున్న సినిమా జాతర

టాలీవుడ్ కి మళ్లీ మంచి రోజులొచ్చాయి.. ఇప్పటి వరకూ మిస్ అయిన దసరా, దీపావళి, సంక్రాంతి సినిమాల సందడంతా ఈ సమ్మర్లోనే ప్లాన్ చేశారు మేకర్స్.

Telugu Movies Releases: సమ్మర్ లో హీటెక్కించబోతున్న సినిమా జాతర

Telugu Movies Release

Telugu Movies Releases: టాలీవుడ్ కి మళ్లీ మంచి రోజులొచ్చాయి.. ఇప్పటి వరకూ మిస్ అయిన దసరా, దీపావళి, సంక్రాంతి సినిమాల సందడంతా ఈ సమ్మర్లోనే ప్లాన్ చేశారు మేకర్స్. భీమ్లానాయక్ తో మొదలుపెట్టి.. సర్కారు వారి పాట వరకూ వరస పెట్టి సినిమా రిలీజ్ లతో సర్ పరైజ్ ఇచ్చారు. మరి సమ్మర్ లో సినిమాల వార్ హీటెక్కించబోతుంది.

Garikipati-Pushpa: పుష్పపై గరికపాటి ఫైర్.. స్మగ్లర్‌ను హీరోగా చూపించి ఏం మెసేజ్ ఇద్దామని!

పెద్ద సినిమాల రిలీజ్ ల కోసం ధియేటర్లు రెడీ అవుతున్నాయి. బ్యాక్ టూ బ్యాక్ తమ స్టార్ హీరోల సినిమాల కోసం ఫాన్స్ కూడా రెడీ అవుతున్నారు. కొన్నాళ్ల నుంచి మిస్ అయిన సినిమాల సందడంతా ఇప్పుడు కట్టకట్టుకుని హోల్ సమ్ గా సమ్మర్ కే వచ్చేస్తోంది. వందలకోట్ల బడ్జెట్ తో తెరకెక్కి.. నెలల నుంచి రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న పెద్ద సినిమాలన్నీ ఏమాత్రం లేట్ చెయ్యకుండా వరసగా వచ్చేస్తున్నాయి. ఈపాండమిక్ ఎండ్ అయ్యేదెప్పుడా.. ఇక సినిమాల రిలీజ్ లు ఎప్పుడా అని వెయిట్ చేస్తున్న ఫాన్స్ కి వరసగా అన్ని సినిమాల రిలీజ్ డేట్స్ ఇచ్చి ఫుల్ ఖుష్ చేశారు మేకర్స్.

RRR: 50 రోజుల్లో ఆర్ఆర్ఆర్.. పోస్టర్ తో కౌన్ డౌన్ స్టార్ట్!

ఫస్ట్ నుంచి తెలుగులో ట్రిపుల్ఆర్ రిలీజ్ ని బట్టి మిగతా సినిమాల రిలీజ్ ఫిక్స్ చేసుకుకంటున్నాయి. పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా కలెక్షన్లకు అడ్డురాకుండా, ధియేటర్ల ప్రాబ్లమ్ లేకుండా ఉండేందుకుఈ డెసిషన్ తీసుకున్నారు మేకర్స్. అయితే ఫస్ట్ నుంచి ట్రిపుల్ మూవీ రిలీజ్ డేట్స్ మారుస్తూనే ఉంది. దాంతో మిగతా సినిమాల రిలీజ్ డేట్స్ కూడా షఫుల్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు ట్రిపుల్ ఆర్ ఫైనల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. మార్చి 25న ట్రిపుల్ఆర్ వరల్డ్ వైడ్ రిలీజ్ అంటూ లేటెస్ట్ గా గుడ్ న్యూస్ చెప్పింది.

Khiladi: హిందీలో ఖిలాడీ.. బాలీవుడ్‌లో మాస్ మహరాజ్ మూవీ రిలీజ్!

ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి కాంబినేషన్లో బాలీవుడ్, హాలీవుడ్ స్టార్ కాస్ట్ తో మూడేళ్ల నుంచి దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ట్రిపుల్ఆర్.. సంక్రాంతి రిలీజ్ కోసం హై ప్రమోషన్లు కూడా చేసేసింది. కానీ మళ్లీ కోవిడ్రావడంతో లాస్ట్ మినిట్ లో రిలీజ్ క్యాన్సిల్ చేసుకుంది. సంక్రాంతి తర్వాత మార్చి 28 కానీ ఏప్రిల్ 28 కానీ సినిమా రిలీజ్ చేసే ఛాన్సుందని టెన్ టెటివ్ డేట్స్ అనౌన్స్ చేసిన మేకర్స్.. ఫైనల్ గా మార్చి 25న ధియేటర్లోకి రావడానికి ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే ట్రిపుల్ఆర్ జులై 30 2020, జనవరి 8 2021, అక్టోబర్ 13 2021, జనవరి 7 2022..లో రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసింది కానీ ఇప్పుడు ఐదో డేట్ కి మార్చి 25న మ్యాసివ్ రేంజ్ లో ట్రిపుల్ఆర్ రిలీజ్ అవుతోంది.

SSMB28 : త్రివిక్రమ్ మహేష్ సినిమాకి ముహూర్తం క్లాప్..

ట్రిపుల్ఆర్ ఫైనల్ రిలీజ్ డేట్ వచ్చేసింది కాబట్టి మిగతా సినిమాలు కూడా రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసేసుకున్నాయి. అసలు ట్రిపుల్ ఆర్ కోసమే లాస్ట్ మినిట్ రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్న మూవీ భీమ్లానాయక్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా తెరకెక్కుతున్న కాప్ యాక్షన్ ఎంటర్ టైనర్ జనవరి 12న రిలీజ్ కావాల్సింది.. కానీ పోస్ట్ పోన్ అయ్యి ఫిబ్రవరి 25న రిలీజ్ అనౌన్స్ చేసింది. ఈ రిలీజ్ డేట్ లో కూడా ట్విస్ట్ ఇచ్చింది భీమ్లానాయక్. పరిస్తితుల్ని బట్టి ఫిబ్రవరి 25న కానీ, ఏప్రిల్ ఫస్ట్ న కానీ రిలీజ్ చేస్తాం అని లేటెస్ట్ గా అనౌన్స్ చేశారు మేకర్స్.

Naresh : సీనియర్ నటుడు నరేష్.. మొన్న లగ్జరీ కారవాన్.. ఇవాళ లగ్జరీ కార్..

99 పర్సెంట్ ఫిబ్రవరికే టార్గెట్ పెట్టుకున్న భీమ్లానాయక్.. ఆ డేట్ కే రిలీజ అయితే.. రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఒక వేళ ఏ కారణంతో అయినా ఫిబ్రవరికి కాకుండా ఏప్రిల్ ఫస్ట్ న రిలీజ్ అయితే మాత్రం మళ్లీ ట్రిపుల్ఆర్ అడ్డం పడే ఛాన్సుంది. ట్రిపుల్ఆర్ మార్చి 25కాబట్టి.. జస్ట్ వన్ వీక్ డిఫరెన్స్ తో రాబోతోంది కాబట్టి.. మరోసారి భీమ్లానాయక్ కి ట్రిపుల్ఆర్ గండం అడ్డు తగిలే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే పవర్ స్టార్ ఫాన్స్ మాత్రం ఎన్ని సినిమాలొచ్చినా.. అన్న కలెక్షన్లు తగ్గేదేలే అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

Movie Releases: ఈసారి పక్కా.. డేట్ ఫిక్స్ చేసుకున్న స్టార్ హీరోలు!

మహేష్ బాబు కూడా సమ్మర్ వార్ కే రెడీ అయ్యారు. గతంలో కలిసొచ్చిన సినిమాలతో సంక్రాంతికే సర్కారు వారి పాట రిలీజ్ అని సినిమా స్ట్టార్ట్ చేసినప్పుడే డేట్ లాక్ చేసుకున్నారు. అయితే ట్రిపుల్ఆర్ కోసం సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నారు. తర్వాత ఉగాదికి టార్గెట్ పెట్టుకున్న మహేష్ ఇప్పుడు ఏకంగా మే కి షిఫ్ట్ అయిపోయారు.

Movie Tickets Issue: ఫిబ్రవరిలో విడుదల.. టికెట్స్ వివాదం పరిష్కారమవుతుందా?

సినిమా స్టార్ట్ చేసినప్పుడే సంక్రాంతికి రిలీజ్ అని అనౌన్స్ చేసిన మహేష్ బాబు సర్కారు వారి పాట జనవరి బరిలోని నుంచి తప్పుకుని ఏప్రిల్ ఫస్ట్ న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. అయితే ఇప్పుడు మిడ్ సమ్మర్ లో మే 12న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది మహేష్ మూవీ. పరశురామ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ ఈ నెలాఖరు నుంచి లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ చేసి నెల రోజుల బ్యాలెన్స్ వర్క్ ని కంప్లీట్ చెయ్యబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా అసలు ఎవరూ అడ్డు లేకుండా మే 12న మ్యాసివ్ ఆక్షన్ కిరెడీ అవుతోంది.

F3 Movie: షూటింగ్ జర్నీ కంప్లీట్.. ఇక నవ్వుల జర్నీ స్టార్ట్!

సంవత్సరం నుంచి రిలీజ్ పోస్ట్ పోన్ అవుతున్న తండ్రీ కొడుకుల క్రేజీ మల్టీస్టారర్ ఆచార్య కూడా ఫైనల్ డేట్ అనౌన్స్ చేసింది. రామ్ చరణ్, చిరంజీవి కాంబినేషన్లో కొరటాలశివ డైరెక్షన్లో తెరెకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 29న రిలీజ్ అవుతోంది. లాస్ట్ ఇయర్ ఆగస్ట్, దసరాకి రిలీజ్ మిస్ అయిన ఆచార్య ఈ సంవత్సరం ఫిబ్రవరి 4న రాకపోవడంతో ఏప్రిల్ ఫస్ట్ న ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు మిగతా సినిమాల డేట్స్ క్లాష్ కాకుండాఏప్రిల్ 29న ధియేటర్లోకి వస్తున్నాడు ఆచార్య.

New Movies Release: ఫిబ్రవరి ఫిల్మ్ ఫెస్టివల్ కి రెడీ అవుతున్న థియేటర్లు!

ఈ సినిమాలతో పాటు లాస్ట్ ఇయర్ ఆగస్ట్ కి రిలీజ్ టార్గెట్ పెట్టుకున్న ఎఫ్ 3 మూవీ కూడా ఫైనల్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్లో అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ సంక్రాంతి రిలీజ్ ప్లాన్ చేసుకుంది. కానీ రకరకాల కారణాలతో రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంది. ఏప్రిల్ లో రిలీజ్ అని అనౌన్స్ చేసిన మేకర్స్.. ఏప్రిల్ 28న రిలీజ్ గ్యారంటీ అని ఫైనల్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇలా సమ్మర్ మొత్తం బ్యాక్ టూ బ్యాక్ పెద్ద సినిమాలతో సినిమాల జాతర తో జరగబోతోంది. అన్నీ బావుంటే.. భీమ్లానాయక్ తో బోణీ కొట్టి.. సర్కారు వారి పాట సక్సెస్ తో సమ్మర్ ని సక్సెస్ ఫుల్ గా రన్ చేద్దామని ప్లాన్ చేసుకుంది టాలీవుడ్.