New Movies Release: ఫిబ్రవరి ఫిల్మ్ ఫెస్టివల్ కి రెడీ అవుతున్న థియేటర్లు!

2022ని వరస రిలీజ్ లతో గ్రాండ్ గా స్టార్ట్ చేద్దామనుకున్న టాలీవుడ్ ఆశలన్నీ సినిమాలతో పాటు పోస్ట్ పోన్ అయిపోయాయి.

New Movies Release: ఫిబ్రవరి ఫిల్మ్ ఫెస్టివల్ కి రెడీ అవుతున్న థియేటర్లు!

New Movies Release

Updated On : January 29, 2022 / 7:09 PM IST

New Movies Release: 2022ని వరస రిలీజ్ లతో గ్రాండ్ గా స్టార్ట్ చేద్దామనుకున్న టాలీవుడ్ ఆశలన్నీ సినిమాలతో పాటు పోస్ట్ పోన్ అయిపోయాయి. కోవిడ్ దెబ్బకి ఒకటి రెండు సినిమాలు తప్పించి జనవరి లో రిలీజ్ లన్నీ దాదాపుగా పోస్ట్ పోన్ అయ్యాయి. అందుకే ఫిబ్రవరి రిలీజ్ ల మీదే కాన్సన్ ట్రేట్ చేస్తున్నారు ఫాన్స్. కొన్ని సినిమాలు మేం రిలీజ్ కు రెడీ అంటుంటే మరి కొన్ని సినిమాలు మాత్రం.. మంచి టైమ్ చూసుకుని వస్తామంటున్నాయి. ఇలా ఫిబ్రవరి లో రిలీజ్ ల హడావుడి జరుగుతుంది.

Prabhas: పాన్ వరల్డ్ రేంజ్.. ప్రభాస్ ఇకపై పాన్ ఇండియాస్టార్ కాదు!

జనవరి మొత్తం కోవిడ్ దెబ్బకి ధియేటర్లన్నీ క్లోజ్ అయిపోయాయి. అయిందేదో అయిపోయిందని ఫిబ్రవరి వైపే చూస్తున్నారు ఆడియన్స్ తో పాటు సినిమా వాళ్లు. ఫిబ్రవరిలో సినిమాలు కొన్ని అనుకున్న ప్రకారమే రిలీజ్ ఫిక్స్ అయితే.. కొన్ని మాత్రం పోస్ట్ పోన్ చేసుకుంటున్నాయి. ఆల్రెడీ ఫిబ్రవరి 11న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న అడవి శేష్ మూవీ మేజర్ రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకోవడంతో మిగిలిన సినిమాలు రిలీజ్ అవుతాయా లేదా అంటూ డైలమాలో ఉన్నారు ఫాన్స్.

Bheemla Nayak: భీమ్లా వాయిదా పడిందా? లేక శర్వా ధైర్యం చేశాడా?

కొన్ని సినిమాలు పోస్ట్ పోన్ వైపు చూస్తుంటే.. రవితేజ మాత్రం ఖిలాడి మూవీని ఫిబ్రవరి 11న ఎట్టిపరిస్తితుల్లో రిలీజ్ చేస్తున్నట్టు రీసెంట్ పోస్టర్లు, సాంగ్స్ లో కూడా అనౌన్స్ చేశారు. కోవిడ్ సిచ్యువేషన్స్ ఉన్నా ఈమధ్య రిలీజ్ అయిన టాలీవుడ్ మూవీస్ కి మంచి సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్.. ఖిలాడిని కూడా ఆదరిస్తారన్న పాజిటివ్ థాట్ తో సినిమాని ఫిబ్రవరి 11నే రిలీజ్ చేస్తోంది టీమ్.

Unstoppable with NBK: రెండో సీజన్ కి సర్వం సిద్ధం.. తొలి గెస్ట్ ఎవరంటే?

యంగ్ హీరో నిఖిల్.. సుకుమార్ బ్యానర్ లో చేస్తున్న 18 పేజెస్ మూవీ కూడా ఫిబ్రవరిలోనే రిలీజ్ అన్నారు. అయితే లేటెస్ట్ గా కోవిడ్ వల్ల నా సినిమాలు రిలీజ్ కావడం లేదని సోషల్ మీడియాలో తెగ వర్రీ అయిపోయాడు నిఖిల్. మరి ఫిబ్రవరి 18న వద్దామనుకుంటున్న నిఖిల్ 18 పేజెస్ రిలీజ్ అవుతుందో లేదో.. ఇంకా క్లారిటీ ఇవ్వలేదు టీమ్.

Nikhil Siddharth: ఎందుకిలా నా ఖర్మ కాలిపోతుంది.. తెగ వర్రీ అయిపోతున్న నిఖిల్

ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో మాత్రం ఇంట్రస్టింగ్ సినిమాలు రిలీజ్ అనౌన్స్ చేశాయి. ఫిబ్రవరి 24న సుదీప్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కతున్న విక్రాంత్ రోనా రిలీజ్అనౌన్స్ చేసింది. బారీ స్కేల్ లో రిలీజ్ అవుతుందనుకున్న ఈ సినిమా ఇప్పుడున్నకోవిడ్ సిచ్యువేషన్స్ లో రిలీజ్ కష్టమని, సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నట్టు లేటెస్ట్ గా అనౌన్స్ చేసింది టీమ్.

OTT Releases: అదిరే ఆఫర్స్.. ఓటీటీ బాటలో మినిమం బడ్జెట్ మూవీస్!

ఇక ఫిబ్రవరి 25న పవన్ కల్యాణ్ భీమ్లానాయక్ మీద అసలు ఎటువంటి డౌట్స్ పెట్టుకోవద్దని హింట్లు ఇస్తూనే.. ఎట్టి పరిస్తితుల్లో భీమ్లానాయక్ ఫిబ్రవరి 25నే వస్తాడని స్ట్రాంగ్ గా అనౌన్స్ చేశారు టీమ్. ఇప్పటికే మ్యాగ్జిమమ్ షూట్ కంప్లీట్ చేసిన టీమ్.. ఫిబ్రవరి 25నే రావడానికి ఫిక్స్ అయ్యారు.

Crazy Combinations: మళ్లీ మళ్లీ మేమే.. కాంబినేషన్స్ తో బ్యాక్ టు బ్యాక్ రచ్చ!

మిగతా సినిమాల సంగతి ఎలా ఉన్నా నేను మాత్రం రిలీజ్ చెయ్యడానికి రెడీ గా ఉన్నానంటోంది ఆలియా భట్. జనవరి నుంచి పోస్ట్ పోన్ అయ్యి ఫిబ్రవరి 18న రిలీజ్ అని అప్పుడెప్పుడో అనౌన్స్ చేసింది. అప్పుడు పోస్ట్ పోన్ అయిన సంజయ్ లీలా భన్సాలీ, ఆలియా భట్ మూవీ గంగూభాయ్ కతియా వాడి లేటెస్ట్ గా ఫిబ్రవరి 25న రిలీజ్ అవుతున్నట్టు క్లారిటీ ఇచ్చింది.
Ravi Teja: ఫిప్త్ గేర్‌లో దూసుకెళుతున్న మాస్ రాజా!
ఫిబ్రవరిలో మరో అవెయింటింగ్ బాలీవుడ్ మూవీ కూడా రిలీజ్ కాబోతోంది. రణవీర్ సింగ్ హీరోగా దివ్యాంగ్ టక్కర్ అనే యంగ్ డైరెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్న సినిమా జయేష్ భాయ్ జోర్దార్ . కంప్లీట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ రిలీజ్ డేట్ కూడా ఫిబ్రవరి 25నే అనౌన్స్ చేసింది టీమ్. ఇలా.. ఫిబ్రవరిలో కొన్ని సినిమాలు రిలీజ్ మార్చుకుంటుంటే.. కొన్ని మాత్రం ఇక లేట్ చేసేది లేదని.. డేర్ గానే అనుకున్న టైమ్ కే ఆడియన్స్ ముందుకు రావడానికి ప్లాన్ చేస్తున్నాయి.