Prabhas: పాన్ వరల్డ్ రేంజ్.. ప్రభాస్ ఇకపై పాన్ ఇండియాస్టార్ కాదు!

ఏ ముహూర్తాన బాహుబలి మొదలుపెట్టాడో.. ప్రభాస్ కి పాన్ ఇండియా అన్న పదం ఇంటి పేరుగా సెటిల్ అయిపోయింది.

Prabhas: పాన్ వరల్డ్ రేంజ్.. ప్రభాస్ ఇకపై పాన్ ఇండియాస్టార్ కాదు!

Prabhas

Prabhas: ఏ ముహూర్తాన బాహుబలి మొదలుపెట్టాడో.. ప్రభాస్ కి పాన్ ఇండియా అన్న పదం ఇంటి పేరుగా సెటిల్ అయిపోయింది. రెబల్ స్టార్ ప్రభాస్ అన్న మాట పోయి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అని ఫేమస్ అయిపోయింది.. కానీ ఇప్పుడు అది మాయమైపోతోంది. ప్రజెంట్ ప్రభాస్ చేస్తున్న సినిమాలతో పాన్ ఇండియా ప్లేస్ లో పాన్ వరల్డ్ హీరో, యూనివర్సల్ స్టార్ అని కొత్త ట్యాగ్ లు యాడ్ అవ్వబోతున్నాయి.

Bheemla Nayak: భీమ్లా వాయిదా పడిందా? లేక శర్వా ధైర్యం చేశాడా?

ప్రభాస్ ఓ పేరుకాదు.. తెలుగు సినిమా బ్రాండ్.. ఇండియన్ సినిమా ఐకాన్.. అని మనం అనుకోవడమే కాదు.. ఆల్ ఓవర్ ఇండియా మొత్తం చెబుతోంది. జస్ట్ టాలీవుడ్ హీరోగా ఉన్న ప్రభాస్ బాహుబలి తో పాన్ ఇండియా అయిపోయారు. అప్పటి నుంచి పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్.. అక్కడితో ఆగిపోవాలనుకోవట్లేదు. అందుకే పాన్ వరల్డ్ రేంజ్ లో సినిమాలు చేస్తున్నారు. లేటెస్ట్ గా ఆదిపురుష్ కూడా పాన్ వరల్డ్ లెవల్లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్టు న్యూస్.

Unstoppable with NBK: రెండో సీజన్ కి సర్వం సిద్ధం.. తొలి గెస్ట్ ఎవరంటే?

బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్, ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మైథలాజికల్ డ్రామా ఆదిపురుష్ అనౌన్స్ మెంట్ నుంచేసెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రభాస్ రాముడి క్యారెక్టర్ లో ఎలా ఉండబోతున్నారో అంటూ ఫస్ట్ నుంచి విపరీతమైన ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి ఈ సినిమా మీద. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో పాటు.. హై ఇంటెన్సిటీ గ్రాఫిక్ వర్క్ తో తెరకెక్కుతున్న ఈ మూవీని ఇప్పుడు హాలీవుడ్ రేంజ్ లో రిలీజ్ చెయ్యాలనుకుంటున్నారు టీమ్. హాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ డిస్నీ స్టూడియోస్ తో కలిసి వరల్డ్ వైడ్ గా 10 భాషల్లో ఆదిపురుష్ ని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు ఆదిపురుష్ టీమ్.

NBK 107 : బాబు రెడీ బాబు.. ఈసారి నాలుగు భాషల్లో!

ప్రభాస్ తన కెరీర్ లో మైల్ స్టోన్ మూవీని కూడా పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించబోతున్నారు. సందీప్ వంగా డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా చేస్తున్న క్రేజీ మూవీ ని సౌత్ లాంగ్వేజెస్ తోపాటు హిందీ, జపనీస్, చైనీస్.. ఇలా 8 భాషల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్ గానే అనౌన్స్ చేశారు మేకర్స్. భారీ బడ్జెట్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమా ఈసంవత్సరంలోనే సెట్స్ మీదకెళ్లబోతోంది.

Prabhas: ప్రభాస్ జాతర.. డేట్స్ కోసం వెంటపడుతున్న ప్రొడ్యూసర్స్!

ప్రభాస్ ఇప్పటి వరకూ పాన్ ఇండియాసినిమాలుచేస్తే.. నాగాశ్విన్ మాత్రం ప్రభాస్ తో పాన్ వరల్డ్ సినిమా స్టార్ట్ చేశారు. సినిమా అనౌన్స్ చేసినప్పుడే పాన్ వరల్డ్ మూవీగా అనౌన్స్ చేసి ప్రభాస్ రేంజ్ ని ఓ లెవల్ కి తీసుకెళ్లారు. ప్రాజెక్ట్ కె టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇలా వరుసగా 3 పాన్ వరల్డ్ సినిమాలు చేస్తూ.. ప్రభాస్ యూనివర్సల్ ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చెయ్యడానికి రెడీ అయ్యారు.