Bheemla Nayak: భీమ్లా వాయిదా పడిందా? లేక శర్వా ధైర్యం చేశాడా?

సినిమాల విడుదల విషయంలో మేకర్స్ మధ్య తీవ్రమైన ఒత్తిడి నెలకొంటుంది. దీనికి కారణం కరోనా దెబ్బతో సినిమాలు పూర్తయినా ల్యాబులలోనే..

Bheemla Nayak: భీమ్లా వాయిదా పడిందా? లేక శర్వా ధైర్యం చేశాడా?

Bheemla Nayak

Bheemla Nayak: సినిమాల విడుదల విషయంలో మేకర్స్ మధ్య తీవ్రమైన ఒత్తిడి నెలకొంటుంది. దీనికి కారణం కరోనా దెబ్బతో సినిమాలు పూర్తయినా ల్యాబులలోనే మగ్గిపోతున్నాయి. ఒకవేళ కొద్దీ గొప్ప సినిమాలు బ్యాలెన్స్ ఉన్నా ముందు రిలీజ్ ముహూర్తం చూసుకుందాం తర్వాత పూర్తి చేద్దాం.. ముందే ఎందుకు బడ్జెట్ కి వడ్డీలు భరించాలి అనేలా ఉంది ధోరణి. ఒకటి కాదు రెండు కాదు దాదాపు రెండు డజన్ల తెలుగు సినిమాలు క్యూలో ఉన్నాయి. అందులో భారీ బడ్జెట్, బడా క్రేజ్ ఉన్న సినిమాలే ఎక్కువగా ఉన్నాయి.

Unstoppable with NBK: రెండో సీజన్ కి సర్వం సిద్ధం.. తొలి గెస్ట్ ఎవరంటే?

ఇండియన్ క్రేజే మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ మార్చి లేదా ఏప్రిల్ లో విడుదల అని ప్రకటించగా మార్చిలో రావడం కష్టమేనని ఫిక్స్ అయింది. దీంతో ఏప్రిల్ లోపు మిగతా భారీ సినిమాలు విడుదల చేసుకోవాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. అందుకే పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ కు ఫిబ్రవరి 25 అని ప్రకటించేశారు. అయితే.. సినిమా షూటింగ్ బ్యాలెన్స్ ఉండగా కరోనా నేపథ్యంలో అది ఎప్పుడు పూర్తవుతుందన్న చర్చ నడుస్తుంది.

Pushpa: పుష్ప సినిమాను మిస్ చేసుకున్న ఐదుగురు స్టార్స్.. ఎవరో తెలుసా?

కాగా.. భీమ్లా నాయక్ ప్రకటించిన ఫిబ్రవరి 25నే శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాను కూడా విడుదలకి ప్రకటించారు. పవన్ లాంటి హీరోకు శర్వా పోటీగా సినిమా విడుదల చేయడం ఆసక్తిగా కనిపిస్తుంది. అయితే.. భీమ్లా ఫిబ్రవరి డేట్ కష్టం కాబట్టే శర్వా సినిమాని ప్రకటించారా అనే చర్చ జరుగుతుంది. భీమ్లా వాయిదా పడడం గ్యారంటీ కాబట్టే శర్వా ఆ తేదీకి ముందే ఖర్చీఫ్ వేశాడని కూడా చెప్పుకుంటున్నారు. అయితే.. ఈ మధ్య కాలంలో చెప్పిన తేదీకి సినిమాలు రావడం.. వాయిదా వేసుకోడం చాలా సాధారణమే కనుక ఈ సినిమాల విడుదలలో ఏం జరుగుతుందో చూడాలి.