Pushpa: పుష్ప సినిమాను మిస్ చేసుకున్న ఐదుగురు స్టార్స్.. ఎవరో తెలుసా?

పుష్ప సినిమా మేనియా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. పాండమిక్ సమయంలో కూడా ప్రపంచ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ ను కొల్లగొట్టిన ఈ సినిమా..

Pushpa: పుష్ప సినిమాను మిస్ చేసుకున్న ఐదుగురు స్టార్స్.. ఎవరో తెలుసా?

Pushpa (1)

Pushpa: పుష్ప సినిమా మేనియా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. పాండమిక్ సమయంలో కూడా ప్రపంచ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ ను కొల్లగొట్టిన ఈ సినిమా అల్లు అర్జున్ ను పాన్ ఇండియా స్టార్ ను చేసేసింది. ముఖ్యంగా ఉత్తరాదిన బన్నీని స్పెషల్ స్టార్ ను చేసేసింది. దక్షణాది అన్ని బాషల కంటే హిందీ ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరధం పట్టారు. పుష్ప దెబ్బకి అల్లు అర్జున్ ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా స్టార్ క్రేజ్ దక్కించుకున్న హీరోగా మారిపోయాడు.

Nikhil Siddharth: ఎందుకిలా నా ఖర్మ కాలిపోతుంది.. తెగ వర్రీ అయిపోతున్న నిఖిల్

తొలి పార్ట్ సూపర్ డూపర్ హిట్ తో ఇప్పుడు పుష్ప మేకర్స్ రెండో పార్టును మరికాస్త పగడ్బంధీగా తెరకెక్కించేందుకు సన్నాహాలు మొదలు పెట్టారు. ఈ సినిమా ఒక్క అల్లు అర్జున్ కు మాత్రమే కాదు.. దర్శక, నిర్మాతల నుండి ఇందులో నటించిన మిగతా నటీనటుల వరకు అందరికీ ఓ మెట్టుగా మారిపోయింది. అయితే.. ముందుగా ఈ సినిమాలో నటించేందుకు కొందరు నటీనటులను అనుకున్నా చివరికి వారు కాకుండా మరొకరు ఈ సినిమాలో నటించాల్సి వచ్చింది.

OTT Platforms: మేకర్స్ కు ఓటీటీ బిగ్ ఆఫర్స్.. ఊ అంటారా.. ఊహూ అంటారా!

ముందుగా ఈ కథను సుకుమార్ మహేష్ బాబుతో తెరకెక్కించాలని అనుకున్నాడట. అయితే.. మహేష్ పుష్పరాజ్ మేకోవర్ కు, స్క్రీన్‌పై నెగెటివ్ క్యారెక్టర్‌ని చూపించడానికి ఇష్టపడకపోవడంతో మార్పుల చేర్పులతో బన్నీ వద్దకి వెళ్లిందట. ఇక శ్రీవల్లి పాత్రను కూడా మొదట సమంతను అనుకున్నా.. కొన్ని కారణాలతో ఆమె ఆ ఆఫర్‌ను తిరస్కరించగా చివరికి ఆ పాత్ర రష్మికకి వెళ్లింది. అయితే.. అదే సమంతా స్పెషల్ సాంగ్ తో అదరగొట్టింది.

Crazy Combinations: లాంగ్ గ్యాప్ తర్వాత గ్యాప్ లేకుండా క్రేజీ కాంబినేషన్స్!

సమంతా స్పెషల్ సాంగ్ కూడా ముందుగా దిశా పటాని ఫస్ట్ ఛాయిస్ అనుకోగా, ఆ తర్వాత బాలీవుడ్ బ్యూటీ నోరాను అనుకున్నారు. కానీ చివరకు సమంతను ఈ పాటకు ఒప్పించారట. ఇక ఫహద్ ఫాజిల్ పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్రను ముందుగా విజయ్ సేతుపతికి ఆఫర్ చేయగా.. డేట్స్ సమస్యల కారణంగా ఫహద్ ఫాజిల్ నటించాడు. ఇక.. సినిమా మొత్తం బన్నీ పక్కనే ఉండే కేశవ పాత్రకి ముందుగా షార్ట్ ఫిల్మ్స్ నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ మహేష్ విట్టాను అనుకోగా మేకర్స్ ఏవో కారణాలతో జగదీశ్ ప్రతాప్ కి దక్కింది.