Unstoppable with NBK: రెండో సీజన్ కి సర్వం సిద్ధం.. తొలి గెస్ట్ ఎవరంటే?

బాలయ్య అంటే ఇదిరా అనేలా అభిమానులు కాలర్ ఎగరేసుకొనేలా చేసిన షో ఆహా అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే.

Unstoppable with NBK: రెండో సీజన్ కి సర్వం సిద్ధం.. తొలి గెస్ట్ ఎవరంటే?

Unstoppable With Nbk

Updated On : January 29, 2022 / 2:27 PM IST

Unstoppable with NBK: బాలయ్య అంటే ఇదిరా అనేలా అభిమానులు కాలర్ ఎగరేసుకొనేలా చేసిన షో ఆహా అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే. బాలయ్య హోస్ట్ ఏంటి అనే వాళ్ళ నోళ్లు మూయించేసిన ఈ షో తర్వాత బాలయ్య ఏంటో తెలియడమే కాదు.. బాలయ్య క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది అనడంలో ఏమాత్రం డౌట్ అక్కర్లేదు. ఈ టాక్ షో IMDB (ఇంటర్నెట్ మూవీ డేటా బేస్) మన దేశంలో ప్రసారమయ్యే టాక్ షోలపై నిర్వహించిన సర్వేలో 9.7 రేటింగ్‌తో తొలి స్థానంలో నిలిచింది.

NBK 107 : బాబు రెడీ బాబు.. ఈసారి నాలుగు భాషల్లో!

ఇక ఈ షోలో ప్రతీ వారం ఎవరు గెస్ట్‌గా వస్తారనే విషయం సామాన్యులతో పాటు సెలబ్రిటీలలో కూడా ఆసక్తి కనిపించేది. అయితే.. క్రేజ్ ఉంది కదా అని సీరియల్ మాదిరి ప్రతి వారం లేకుండా సీజన్లుగా ఆహా ప్లాన్ చేసింది. తొలి సీజన్ లాస్ట్ ఎపిసోడ్ ను సూపర్ స్టార్ మహేష్ బాబుతో కంప్లీట్ చేయగా.. త్వరలోనే రెండో సీజన్ మొదలు పెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీంతో ఈ రెండో సీజన్ లో తొలి గెస్ట్ ఎవరన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Poonam Bajwa : చెట్లతో లవ్ స్టోరీ అంటున్న పూనమ్

తొలి సీజన్ ను మంచు మోహన్ బాబుతో మొదలు పెట్టి ఓ స్థాయిలో వెల్ కం సెట్ చేసిన ఆహా టీం.. రెండో సీజన్ ను అంతకు మించి అనేలా ప్లాన్ చేసింది. ఈసారి రెండో సీజన్ తొలి ఎపిసోడ్ కు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా రాబోతున్నారని ఓ టాక్ మొదలైంది. నిజానికి చిరును తొలి సీజన్ లో ఆహ్వానించనున్నట్లు అనుకున్నారు. కానీ.. ఒక స్కేల్ ప్రకారం గెస్ట్ లిస్ట్ సెట్ చేయడంతో అప్పుడు కుదరలేదు. అయితే.. రెండో సీజన్ తొలి ఎపిసోడ్ చిరుతో అయితే.. షో స్థాయితో పాటు గ్రాండ్ వెల్ కం ఇచ్చినట్లుగా ఉంటుందని ఆహా టీం ఆలోచన చేస్తుందట. మరి ఈ ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి.