Garikipati-Pushpa: పుష్పపై గరికపాటి ఫైర్.. స్మగ్లర్‌ను హీరోగా చూపించి ఏం మెసేజ్ ఇద్దామని!

స్టైలిష్ స్టార్ ను ఐకాన్ స్టార్ చేసి.. ఏకంగా పాన్ ఇండియా స్టార్ ను చేసిన సినిమా పుష్ప. బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన పుష్ప..

Garikipati-Pushpa: పుష్పపై గరికపాటి ఫైర్.. స్మగ్లర్‌ను హీరోగా చూపించి ఏం మెసేజ్ ఇద్దామని!

Garikipati Pushpa

Garikipati-Pushpa: స్టైలిష్ స్టార్ ను ఐకాన్ స్టార్ చేసి.. ఏకంగా పాన్ ఇండియా స్టార్ ను చేసిన సినిమా పుష్ప. బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన పుష్ప సినిమాకి ఇప్పుడు రెండో పార్ట్ కూడా సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. కాగా.. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ హీరో కాగా.. తానో ఎర్రచందనపు దుంగల స్మగ్లర్ అని తెలిసిందే. దీనిపై తెలుగు సాహితీ ప్రవచన కర్త, మహా సహస్రావధాని, పద్మశ్రీ అవార్డు గ్రహీత గరికపాటి నరసింహా రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

RRR: 50 రోజుల్లో ఆర్ఆర్ఆర్.. పోస్టర్ తో కౌన్ డౌన్ స్టార్ట్!

పుష్ప సినిమాలో ఓ స్మగ్లర్ ను హీరోను చేశారని.. ఇలా హీరో, దర్శకుడు సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని గరికపాటి సెటైర్లు వేశారు. ఈ సినిమాలో దాక్కో దాక్కో మేక పాట లైన్స్ ను కూడా తప్పుబట్టారు. ఈ పాటలో దర్శకుడు సుకుమార్.. ఈ సృష్టిలో ఏది తప్పు కాదన్నట్టు ఆ చూపించాడని.. మొత్తం సినిమాలో అంతా చెడు చూపించి చివరి 5 నిమిషాల్లో మంచి చూపిస్తాం. పుష్ప 2 తీస్తాం.. నువ్వు తీసేలోపే సమాజం చెడిపోవాలా.. అని ప్రశ్నించాడు.

Khiladi: హిందీలో ఖిలాడీ.. బాలీవుడ్‌లో మాస్ మహరాజ్ మూవీ రిలీజ్!

అంతేకాదు స్మగ్లింగ్ చేసేవాడు.. ఏదో ఘనకార్యం చేసినట్టు తగ్గేదేలే అంటాడు. ఇపుడిది ఉపనిషత్ సూక్తి అయిందని కామెంట్ చేశారు. ఈ డైలాగుతో సమాజంలో నేరాలు, ఘోరాలు పెరుగుతున్నాయని.. దీనిపై హీరో, డైరెక్టర్‌ను సమాధానం చెప్పాలి అంటూ గరికపాటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గరికపాటి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారగా.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.