Movie Releases: ఈసారి పక్కా.. డేట్ ఫిక్స్ చేసుకున్న స్టార్ హీరోలు!

సంక్రాంతి సీజన్ ను వదులుకున్న టాలీవుడ్ హీరోలు సమ్మర్ మాదే అంటున్నారు. ఎప్పుడెప్పుడా అని ఆడియెన్స్ ఎదురుచూస్తున్న సినిమాలు అసలైన..

Movie Releases: ఈసారి పక్కా.. డేట్ ఫిక్స్ చేసుకున్న స్టార్ హీరోలు!

Movie Releases

Movie Releases: సంక్రాంతి సీజన్ ను వదులుకున్న టాలీవుడ్ హీరోలు సమ్మర్ మాదే అంటున్నారు. ఎప్పుడెప్పుడా అని ఆడియెన్స్ ఎదురుచూస్తున్న సినిమాలు అసలైన రిలీజ్ డేట్స్ ను ప్రకటించేశాయి. పవర్ స్టార్ తో మొదలెడితే సూపర్ స్టార్ వరకు అందరూ డేట్స్ ఫిక్స్ చేసుకొని వరసపెట్టారు.

KGF2: దేశాన్ని ఊపేసిన పాట.. ఐటెం భామగా అనన్య!

మార్చ్ 25న ట్రిపుల్ ఆర్ రిలీజ్ అని తెల్చేసారు రాజమౌళి. నేషనల్ ఆడియెన్స్ మోస్ట్ అవైటైడ్ మూవీ ఆర్ఆర్ఆర్… సంక్రాంతి నుంచి తప్పుకుని రెండు డేట్స్ ప్రకటించింది. ఇప్పుడు వెరైటీగా మార్చ్ 18, ఏప్రిల్ 28 కాకుండా కొత్తగా మార్చ్ 25నే థియేటర్స్ కి రాబోతున్నట్టు ప్రకటించారు. ఇటు ఇండియాలో.. అటు యూఎస్ లో ఇప్పుడిప్పుడే కొవిడ్ రిలాక్సేషన్ కనిపిస్తుంది కాబట్టి మళ్లీ ప్రమోషన్స్ తో కాస్త హడావిడీ చేసి మార్చ్ 25న ట్రిపుల్ ఆర్ ట్రీట్ ఇవ్వాలనేది జక్కన్న ప్లాన్.

Srikanth Addala: బాలయ్యతో క్లాస్ దర్శకుడి కథా చర్చలు.. సెట్టయ్యేనా?

సర్కారు వారి పాట ఏప్రిల్ 1న రాదని ఫిక్స్ అయ్యాక చిరూ ఆచార్యను ఆ డేట్ కు తీసుకొచ్చారు. కానీ ఏప్రిల్ 1 కాదని వెరీ రీసెంటి గా ఏప్రిల్ 29ని ఫిక్స్ చేసుకున్నారు ఆచార్య టీమ్. ట్రిపుల్ ఆర్ బొమ్మ నేషనల్ వైడ్ పడ్డాకే ఆచార్యను రంగంలోకి దించాలనేది మెగా హీరోల ప్లాన్. ఆ లెక్కన మార్చ్ 25న ఆర్ఆర్ఆర్ హంగామా సృష్టించాక… ఏప్రిల్ 29న చరణ్ తో కలిసి చిరూ ఆచార్యగా కనిపించేందుకు సిద్ధమయ్యారు.

OTT Release: ఈ వారం ఓటీటీలో రాబోతున్న సినిమాలివే!

రీసెంట్ గా బడా ప్రొడ్యుసర్ దిల్ రాజు చెప్పినట్టు సమ్మర్ లోపు బిగ్ స్టార్స్ అందరూ సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేసేలా లెక్కలు వేసుకుంటున్నారు. రిలీజ్ క్లాషెస్ రాకుండా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందరికంటే ముందు బిగ్ లీడ్ ను ప్రభాస్ తీసుకోబోతున్నారు. ట్రిపుల్ ఆర్ కంటే ముందే మార్చ్ 11న రాధేశ్యామ్ ను రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Film Release Clash: మహేష్-చిరు.. తగ్గేది ఎవరు.. వచ్చేది ఎవరు?

కొవిడ్ ఆంక్షలను పూర్తి స్థాయిలో ఎత్తేయకపోతే ఫిబ్రవరి 25న రావాల్సిన భీమ్లా నాయక్ ఏప్రిల్ 1కి షిఫ్ట్ అవుతుంది. ఫిబ్రవరి 25న పవన్ రాకపోతేనే శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహర్లు థియేటర్స్ లో సందడి చేస్తుంది. ఇప్పటికీ భీమ్లా నాయక్ ప్యాచప్ వర్క్ బ్యాలెన్స్ ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేయాల్సి ఉంది. సో ఈలోగా కొవిడ్ రిస్ట్రిక్షన్స్ తగ్గాక ఏప్రిల్ 1న రానాతో కలిసొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు పవర్ స్టార్.

OTT Releases: అదిరే ఆఫర్స్.. ఓటీటీ బాటలో మినిమం బడ్జెట్ మూవీస్!

ఇక హెల్త్ ఇష్యూస్… షూటింగ్ పోస్ట్ పోన్ కారణాలతో వాయిదా మీద వాయిదా పడుతోంది సర్కారు వారి పాట. అయిన లేట్ ఏదో అయింది… లేట్ గా వచ్చిన లేటెస్ట్ పంచ్ ఇవ్వాలనుకుంటున్నారు సూపర్ స్టార్. తన సర్కారు వారి పాటను మే 27న తీసుకొచ్చేలా ఆలోచిస్తున్నారు. అందుకు తగ్గట్టు నెమ్మదిగా సర్కారు వారి పాట ప్రమోషన్స్ జోరు పెంచబోతున్నారు.