Movie Tickets Issue: ఫిబ్రవరిలో విడుదల.. టికెట్స్ వివాదం పరిష్కారమవుతుందా?
ప్రస్తుతం కరోనా వ్యాప్తి తీవ్రంగానే ఉంది. అయితే.. ఇది ఫిబ్రవరిలో తగ్గుముఖం పడుతుందని కొందరు అంచనా వేస్తున్నారు.

Movie Tickets Issue
Movie Tickets Issue: ప్రస్తుతం కరోనా వ్యాప్తి తీవ్రంగానే ఉంది. అయితే.. ఇది ఫిబ్రవరిలో తగ్గుముఖం పడుతుందని కొందరు అంచనా వేస్తున్నారు. దీంతో సినీ మేకర్స్ ఫిబ్రవరి నుండి సినిమాల విడుదలకి సిద్ధమవుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సహా రవితేజ ఖిలాడీ, శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు, నిఖిల్ 18 పేజెస్ సినిమాలు విడుదలకి సిద్ధమవుతున్నాయి.
Saamanyudu: సామాన్యుడిగా రాబోతున్న విశాల్.. కమ్ బ్యాక్ అవుతాడా?
ఫిబ్రవరి నుండి ప్రతి వారం సినిమాలు విడుదల అవుతాయని నిర్మాత, డిస్టిబ్యూటర్ దిల్ రాజు కూడా ప్రకటించేశారు. నిర్మాతల మండలి తరపున దిల్ రాజు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఫిబ్రవరి నుండి సినిమాల విడుదలకి ముహుర్తాలు సరే అప్పటికి సినిమా టికెట్ల వివాదం పరిష్కారమవుంటుందా అనే చర్చ మొదలైంది. ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
F3 Movie: షూటింగ్ జర్నీ కంప్లీట్.. ఇక నవ్వుల జర్నీ స్టార్ట్!
టికెట్ల వివాదంతో పాటు అధికారుల దాడులతో అప్పుడు చాలా థియేటర్లు స్వచ్ఛందంగానే మూసేశారు. టికెట్ల తగ్గింపు భారీ సినిమాల బిజినెస్ మీద తప్పకుండ పడుతుంది. ఈ నేపథ్యంలోనే సినీ పరిశ్రమ నుండి చాలామంది ప్రముఖులు ప్రభుత్వం చర్చలు జరిపినా అప్పుడు అది పరిష్కారమవలేదు. ప్రభుత్వ పెద్దలు ఈ వివాదంపై చర్చ జరుపుతున్నామని చెప్పారు కానీ అది పూర్తవలేదు. మరి ఫిబ్రవరి సినిమాల విడుదల సమాయానికి ఇది కొలిక్కి వస్తుందా లేక మరోసారి వివాదాస్పదమవుతుందా అన్నది చూడాలి.