Saamanyudu: సామాన్యుడిగా రాబోతున్న విశాల్.. కమ్ బ్యాక్ అవుతాడా?

తమిళ స్టార్ హీరో విశాల్ కు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగు వాడే కావడంతో మన ప్రేక్షకులు విశాల్ ను ఓన్ చేసుకున్నారు.

Saamanyudu: సామాన్యుడిగా రాబోతున్న విశాల్.. కమ్ బ్యాక్ అవుతాడా?

Saamanyudu

Saamanyudu: తమిళ స్టార్ హీరో విశాల్ కు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగు వాడే కావడంతో మన ప్రేక్షకులు విశాల్ ను ఓన్ చేసుకున్నారు. అందుకే విశాల్ ప్రతి సినిమా కొంచెం ముందో వెనకో ఇక్కడ కూడా విడుదల అవుతుంటాయి. పందెం కోడి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విశాల్ ప్రతి సినిమా ఇక్కడ డబ్బింగ్ అవుతుంది. మధ్యలో ఒకటీ ఆరా కాస్త పర్వాలేదనిపించినా మళ్ళీ పందెం కోడి లాంటి హిట్ మాత్రం దక్కలేదు.

F3 Movie: షూటింగ్ జర్నీ కంప్లీట్.. ఇక నవ్వుల జర్నీ స్టార్ట్!

కాగా, ఇప్పుడు విశాల్ సామాన్యుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కరోనా కారణంగా ఇప్పటికే రెండు సార్లు రిలీజ్ వాయిదా పడిన సామాన్యుడు సినిమా ఎట్టకేలకి ఫిబ్రవరి 4న విడుదల చేయనున్నారు. ఈ చిత్రంతో శరవణన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ యాక్షన్ డ్రామాకు నాట్ ఏ కామన్ మ్యాన్ అనేది ఉపశీర్షికగా కాగా.. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద ఈ సినిమాను విశాల్ నిర్మిస్తున్నారు.

Naga Chaitanya: తమిళ దర్శకుడితో చైతూ ద్విభాషా చిత్రం?

ఇప్ప‌టికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్, సాంగ్, టీజర్లకు మంచి స్పందన రావ‌డంతో తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. విశాల్ సరసన డింపుల్ హయతి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. మరి ఈ సినిమాతో అయినా విశాల్ మళ్ళీ తెలుగులో కమ్ బ్యాక్ ఇచ్చి సక్సెస్ అందుకుంటాడా లేదా అన్నది చూడాలి.