Unstoppable with NBK స్పెషల్ ప్రోమో.. ఇంత యంగ్ గా ఉన్నావేంటయ్యా బాబు!
నందమూరి నటసింహం బాలకృష్ణ అఖండతో థియేటర్లను, బాక్సాఫీస్ ను దద్దరిల్లేలా చేసి.. అదే ఊపులో డిజిటల్ లో కూడా దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే.

Unstoppable With Nbk
Unstoppable with NBK: నందమూరి నటసింహం బాలకృష్ణ అఖండతో థియేటర్లను, బాక్సాఫీస్ ను దద్దరిల్లేలా చేసి.. అదే ఊపులో డిజిటల్ లో కూడా దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. అచ్చ తెలుగు ఓటీటీగా పేరు తెచ్చుకున్న ఆహా.. బాలయ్యతో అన్ స్టాపబుల్ షో ప్రకటన నుండి ప్రతి ఎపిసోడ్ వేరే లెవెల్ లోనే సెట్ చేస్తుంది. బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్.. టైటిల్ కి యాప్ట్ అయ్యేలా ఎనర్జీకి మ్యాచ్ అయ్యేలా అన్ స్టాపబుల్ షోతో అదరగొడుతున్నారు బాలయ్య.
Unstoppable with NBK: అన్ స్టాపబుల్ బాలయ్య.. తెర వెనుక చిన్న కూతురు!
ఈ సీజన్ చివరి ఎపిసోడ్ ను సూపర్ స్టార్ మహేష్ బాబుతో కంప్లీట్ చేయనున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకులు, అభిమానులు ఈ లాస్ట్ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుండగా.. ఫిబ్రవరి 4న ‘Unstoppable with NBK’ లాస్ట్ ఎపిసోడ్ ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవ్వనుంది. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కు సంబంధించి ప్రోమోలు దుమ్మురేపగా ఈ శుక్రవారం ప్రసారమయ్యే ఈ ఎపిసోడ్ స్పెషల్ ప్రోమోను గురువారం విడుదల చేశారు.
Unstoppable with NBK: రెండో సీజన్ కి సర్వం సిద్ధం.. తొలి గెస్ట్ ఎవరంటే?
తాజాగా విడుదల చేసిన ఈ స్పెషల్ ప్రోమోలో బాలయ్య-మహేష్ టైమింగ్, పంచ్ లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మహేష్ ను ఉద్దేశించి బాలయ్య.. మరీ ఇంత యంగ్ గా ఉన్నావేంటయ్యా బాబూ అంటూ డైలాగ్ కొడితే మహేష్ సిగ్గుపడడం భలే గమ్మత్తుగా అనిపిస్తుంది. ప్రోమోనే ఇలా ఉంటే.. ఎపిసోడ్ ఎలా ఉంటుందోనని ఈ ఇద్దరి హీరోల అభిమానులు, ప్రేక్షకులు అంతా ఈ ఎపిసోడ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.