Varun Dhawan : సౌత్ లో కూడా ప్లాప్ సినిమాలున్నాయి.. బాలీవుడ్ యువ హీరో వ్యాఖ్యలు..

వరుణ్ ధావన్ సౌత్ సినిమాల గుయించి మాట్లాడుతూ.. ''కరోనా పాండమిక్‌ వల్ల రెండున్నరేళ్లుగా మా సినిమా రిలీజ్‌లు ఆగిపోయాయి. ఈ మధ్యే ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్నాయి. వీటిలో కొన్ని............

Varun Dhawan : సౌత్ లో కూడా ప్లాప్ సినిమాలున్నాయి.. బాలీవుడ్ యువ హీరో వ్యాఖ్యలు..

Varun Dhavan

Varun Dhawan :  గత కొన్ని రోజులుగా సౌత్, నార్త్ సినిమాలు అని మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. కొంతమంది బాలీవుడ్ వాళ్ళు సౌత్ సినిమాలని పొగుడుతూ ఇందులో భాగమవుతుంటే మరి కొంతమంది సౌత్ సక్సెస్ ని చూడలేక విమర్శలు కూడా చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ యువ హీరో వరుణ్ ధావన్ సౌత్ సినిమాలపై వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వరుణ్ ధావన్ నటించిన ‘జుగ్‌ జుగ్‌ జియో’ సినిమా రిలిజ్ కి ఉంది. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సౌత్ సినిమాలపై ఈ వ్యాఖ్యలు చేశాడు వరుణ్.

Agent Tina : విక్రమ్ సినిమాలో ఏజెంట్ టీనాగా చేసింది ఎవరో తెలుసా? ఆమె ఎంత ఫేమసో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

వరుణ్ ధావన్ సౌత్ సినిమాల గుయించి మాట్లాడుతూ.. ”కరోనా పాండమిక్‌ వల్ల రెండున్నరేళ్లుగా మా సినిమా రిలీజ్‌లు ఆగిపోయాయి. ఈ మధ్యే ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్నాయి. వీటిలో కొన్ని ఆదరణ పొంది ఉండకపోవచ్చు. కానీ బాలీవుడ్ లో కూడా మంచి సినిమాలు వస్తాయి. సౌత్ సినిమాకి కేవలం సక్సెస్ లు మాత్రమే ఉన్నాయని అనుకోలేం. అక్కడ కూడా ఇటీవల 7,8 సినిమాలు ఫ్లాప్స్‌ అయ్యాయి. చెడ్డ సినిమాను ఏ ప్రేక్షకుడు చూడాలనుకోడు. అలాగే మంచి సినిమా ఏ భాషలో వచ్చినా వదులుకోడు’’ అని అన్నారు.