Ghani : దీపావళికి థియేటర్లలో బాక్సర్ ‘గని’ పంచ్‌లు..

దీపావళి కానుకగా ‘గని’ థియేటర్లలోకి రాబోతున్నాడంటూ న్యూ పోస్టర్ వదిలారు..

Ghani : దీపావళికి థియేటర్లలో బాక్సర్ ‘గని’ పంచ్‌లు..

Ghani

Ghani: మెగాప్రిన్స్‌ వ‌రుణ్ తేజ్ హీరోగా ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, అల్లు బాబీ కంపెనీ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద‌, అల్లు బాబీ నిర్మిస్తోన్న చిత్రం ‘గని’. కిక్ బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ ఫినిషింగ స్టేజ్‌లో ఉంది.

Varun Tej

 

బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేక‌ర్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఉపేంద్ర‌, సునీల్ శెట్టి, న‌వీన చంద్ర త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. వ‌రుణ్‌ తేజ్ ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌న‌టువంటి డిఫ‌రెంట్ లుక్‌తో బాక్సర్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేష‌న‌ల్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి జార్జ్ సి.విలియ‌మ్స్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

Ghani : వరుణ్ తేజ్ ‘గని’ కోసం హాలీవుడ్ స్టంట్స్ డైరెక్టర్స్..

రీసెంట్‌గా ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. దీపావళి కానుకగా ‘గని’ థియేటర్లలోకి రాబోతున్నాడంటూ న్యూ పోస్టర్ వదిలారు. బాక్సింగ్ రింగ్‌లో విజయకేతనం ఎగరేస్తున్న వరుణ్ తేజ్‌ను వెనుకనుండి చూపించారు. హాలీవుడ్ చిత్రం ‘టైటాన్స్‌’, బాలీవుడ్‌లో ‘సుల్తాన్’ వంటి చిత్రాల‌కు యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డిజైన్ చేసిన హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్స్ లార్నెల్ స్టోవ‌ల్‌, వ్లాడ్ రింబ‌ర్గ్ ‘గని’ సినిమాకి యాక్షన్ సీక్వెన్స్ డిజైన్ చేస్తున్నారు.

Chiru – Varun Tej : చిరంజీవి సినిమాలో వరుణ్ తేజ్..