Chiru – Varun Tej : చిరంజీవి సినిమాలో వరుణ్ తేజ్..

చిరంజీవి ‘ఆచార్య’ సినిమా తర్వాత పట్టాలెక్కడానికి రెడీగా ఉన్న సినిమా ‘లూసిఫర్’ రీమేక్. మోహన్ రాజా డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ రీమేక్ మూవీలో వరుణ్ తేజ్ కూడా నటిస్తాడంటున్న వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి..

Chiru – Varun Tej : చిరంజీవి సినిమాలో వరుణ్ తేజ్..

Tollywood Latest Film Updates

Chiru – Varun Tej: చిరంజీవి ‘ఆచార్య’ సినిమా తర్వాత పట్టాలెక్కడానికి రెడీగా ఉన్న సినిమా ‘లూసిఫర్’ రీమేక్. మోహన్ రాజా డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ రీమేక్ మూవీలో వరుణ్ తేజ్ కూడా నటిస్తాడంటున్న వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

కోవిడ్ సెకండ్ వేవ్‌లో మెగా ఫ్యాన్స్ ఇబ్బందుల్లో ఉన్న వాళ్లకి సహాయం చేస్తున్నారు. మెగా ఫ్యాన్స్‌ని చూసి గర్వ పడుతున్నానని, సామాన్యులకు సహాయం చెయ్యడం కోసం ఎంతో అంకిత భావంతో మీరు చేస్తున్న పనుల్ని నోటీస్ చేస్తున్నానని థ్యాంక్స్ నోట్ రాశారు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్.

అచ్చ తెలుగు ఓటీటీ యాప్ ఆహా.. ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్‌తో ఆడియన్స్‌ని ఎంగేజ్ చేస్తోంది. జూన్ 11 నుంచి ప్రీమియర్ అవనున్న ‘అర్ద శతాబ్దం’ సినిమాకు సంబంధించి ‘మెరిసెలే’ అనే మెలొడీ సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ చేసింది టీమ్.

నాగవర్మ బైర్రాజు హీరోగా, హరిచందన్ డైరెక్షన్లో ఏ బ్రాండ్ ఇండియా మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా ‘విక్రమ్’. దివ్యా సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ‘పడిపోయా పడిపోయా’ అనే పాటను స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ రిలీజ్ చేశారు.

ఎస్. పి. బాలు 75 వ జయంతి సందర్బంగా ‘తీరం’ సినిమాలోని పాటలన్నీ ఈ గాన గంధర్వుడికి అకింతమిస్తున్నట్టు అనౌన్స్ చేశారు దర్శక నిర్మాత అనిల్ ఇనమడుగు. ‘తీరం’ సినిమాలో చివరిగా ‘అసలేంటీ ప్రేమా’ పాట పాడారు బాలు.