Pawan Kalyan : పవన్ నిర్ణయంతో షాక్‌లో యువ హీరోలు

'గని' సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే ముందు పవన్ కళ్యాణ్ టీంని సంప్రదించినట్టు సమాచారం. పవన్ సినిమా ఫిబ్రవరి 25న రాదు అని కన్ఫర్మ్ చేసుకున్నాకే గని సినిమా రిలీజ్ డేట్ ని...........

Pawan Kalyan :  పవన్ నిర్ణయంతో షాక్‌లో యువ హీరోలు

Pawan Kalyan

Bheemla Nayak :  ఏపీలో సినిమా టికెట్ల రేట్ల విషయంలో, థియేటర్ల ఆకుపెన్సీ పై సందిగ్దత నెలకొనడంతో ఇటీవల అన్ని సినిమాలు రెండు రిలీజ్ డేట్స్ ని అనౌన్స్ చేశాయి. ఇదే కోవలో వరుణ్ తేజ్ ‘గని’, పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమాలు కూడా రెండు డేట్స్ అనౌన్స్ చేశాయి. ‘గని’ సినిమా ఫిబ్రవరి 25 లేదా మార్చ్ 4న రిలీజ్ చేస్తామని గతంలో ప్రకటించారు. అయితే ఇటీవల చిరంజీవి ఏపీ ప్రభుత్వం మీటింగ్ తర్వాత, ఏపీలో నైట్ కర్ఫ్యూ ఎత్తేయడంతో.. సినీ పరిశ్రమకి శుభవార్త వస్తుంది అని ఆశిస్తూ నిన్న మధ్యాహ్నం ‘గని’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి ఫిబ్రవరి 25నే ఈ సినిమా రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు.

‘భీమ్లానాయక్’ సినిమాను ఫిబ్రవరి 25న లేదా ఏప్రిల్ 1 న రిలీజ్ చేస్తామని ప్రకటించారు గతంలో. అయితే ‘గని’ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే ముందు పవన్ కళ్యాణ్ టీంని సంప్రదించినట్టు సమాచారం. పవన్ సినిమా ఫిబ్రవరి 25న రాదు అని కన్ఫర్మ్ చేసుకున్నాకే గని సినిమా రిలీజ్ డేట్ ని ఫిబ్రవరి 25న అనౌన్స్ చేశారు చిత్ర యూనిట్. అయితే అదే రోజు ఫిబ్రవరి 25వ తేదీన శర్వానంద్ హీరోగా వస్తున్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా కూడా అనౌన్స్ చేశారు. ‘భీమ్లా నాయక్’ రాదు అనే ధైర్యంతోనే వీరిద్దరూ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఇప్పటికే ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టేశారు.

Balakrishna : బప్పి లహరి మరణంపై బాలకృష్ణ సంతాపం

అయితే నిన్న రాత్రి సడెన్ గా ‘భీమ్లా నాయక్’ సినిమా ఫిబ్రవరి 25నే రిలీజ్ చేస్తున్నాము అంటూ అనౌన్స్ చేశారు. దీంతో యువ హీరోలు వరుణ్ తేజ్, శర్వానంద్ షాక్ తిన్నారు. పవన్ కళ్యాణ్ సినిమా ఉంటె వేరే చిన్న సినిమాలు దాదాపు ఆడవు. ఫ్యాన్స్ తో పాటు వేరే ప్రేక్షకులు కూడా పవన్ సినిమాకే మొగ్గు చూపుతారు. సినిమా ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ సినిమాకి కలెక్షన్స్ వస్తాయి. థియేటర్స్ కి జనం వస్తారు. మరి పవన్ సినిమా అనౌన్స్ చేయడంతో తమ సినిమాలని రిలీజ్ చేయాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నారు ఈ యువ హీరోలు.

Ashu Reddy : హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న అషూరెడ్డి

ఇప్పటి వరకు వచ్చిన టీజర్, సాంగ్స్, ట్రైలర్స్, సినీ వర్గాల సమాచారం ప్రకారం గని, ఆడవాళ్ళూ మీకు జోహార్లు సినిమాలు హిట్ అవుతాయనే భావిస్తున్నారు. మంచి కంటెంట్స్ అని , ప్రేక్షకులకి నచ్చుతుందని భావిస్తున్నారు. ఇలాంటి హోప్స్ ఉన్నప్పుడు ‘బీమ్లా నాయక్’కి పోటీగా రిలీజ్ చేసి దెబ్బ తినడం కంటే వాయిదా వేయడం బెటర్ అని భావిస్తున్నారు ఈ చిత్ర నిర్మాతలు. మరి ఫిబ్రవరి 25న ఈ మూడు సినిమాలు రిలీజ్ అవుతాయా, లేదా ఎవరు వాయిదా వేసుకుంటారు అని తెలియాలంటే మరి కొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.