Veera Simha Reddy: పాన్ ఇండియా మూవీగా వస్తున్న వీరసింహారెడ్డి

నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేయగా, పూర్తి ఫ్యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను చిత్ర యూనిట్ మలిచింది. ఈ సినిమాలో బాలయ్య రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటించగా, ప్రేక్షకులు ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ ఇచ్చారు.

Veera Simha Reddy: పాన్ ఇండియా మూవీగా వస్తున్న వీరసింహారెడ్డి

Veera Simha Reddy Gets Pan India Release On OTT

Veera Simha Reddy: నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేయగా, పూర్తి ఫ్యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను చిత్ర యూనిట్ మలిచింది. ఈ సినిమాలో బాలయ్య రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటించగా, ప్రేక్షకులు ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ ఇచ్చారు.

Veera Simha Reddy: ఎట్టకేలకు ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న వీరసింహారెడ్డి

ఇక థియేట్రికల్ రన్ ముగించుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను ఫిబ్రవరి 23న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది మేకర్స్ రెడీ అయ్యారు. ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకునే ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాలో పుష్కలంగా ఉందని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది.

Veera Simha Reddy : హనీ రోజ్‍తో సిప్ వేస్తున్న బాలయ్య.. వైరల్ అవుతున్న ఫోటో!

వీరసింహారెడ్డి మూవీని తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేరోజు స్ట్రీమింగ్‌కు రేడీ చేస్తున్నారు మేకర్స్. దీంతో ఈ సినిమాకు అదిరిపోయే వ్యూయర్షిప్ రావడం ఖాయమని చిత్ర వర్గాలు ఆశిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్, హనీ రోజ్‌లు నటించగా థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు.