Veera Simha Reddy: వీరయ్య కంటే ఎక్కవ రన్‌టైమ్‌తో వస్తున్న వీరసింహారెడ్డి

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ వచ్చే వారంలో రిలీజ్‌కు రెడీ అయ్యింది. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు వైవిధ్యమైన గెటప్స్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

Veera Simha Reddy: వీరయ్య కంటే ఎక్కవ రన్‌టైమ్‌తో వస్తున్న వీరసింహారెడ్డి

Veera Simha Reddy Locks Runtime

Veera Simha Reddy: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ వచ్చే వారంలో రిలీజ్‌కు రెడీ అయ్యింది. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు వైవిధ్యమైన గెటప్స్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

Veera Simha Reddy: ఒంగోలు గడ్డమీదే ‘వీరసింహారెడ్డి’ వేడుక.. చోటు మాత్రమే మారింది..!

కాగా, ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌ను జనవరి 8న ఒంగోలులో నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేయడంతో ఈ ఈవెంట్‌కు గెస్టులుగా ఎవరు వస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా రన్‌టైమ్‌ను లాక్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు 2 గంటల 49 నిమిషాల రన్‌టైమ్‌ను చిత్ర యూనిట్ లాక్ చేసినట్లుగా చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అటు మరో స్టార్ హీరో చిరంజీవి వాల్తేరు వీరయ్య రన్‌టైమ్ 2 గంటల 40 నిమిషాలకు ఫిక్స్ అయ్యింది.

Veera Simha Reddy : వీరసింహారెడ్డిని అడ్డుకున్నామా.. ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి!

దీంతో వాల్తేరు వీరయ్య కంటే కొంత ఎక్కువ రన్‌టైమ్‌తో వీరసింహారెడ్డి దిగుతుండటంతో ఈ సినిమాలో కంటెంట్ ఏ విధంగా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోండగా, థమన్ సంగీతం అందిస్తున్నాడు. జనవరి 12న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.