Venkatesh: వెంకటేష్ నెక్ట్స్ మూవీ.. మరింత ఆలస్యం..?

స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఇటీవల చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ, తన ఏజ్‌కు తగ్గ పాత్రలను చేస్తూ ప్రేక్షకుల్లో తనదైన ఇంప్రెషన్‌ను క్రియేట్ చేస్తున్నాడు....

Venkatesh: వెంకటేష్ నెక్ట్స్ మూవీ.. మరింత ఆలస్యం..?

Venkatesh Next Movie To Get More Delay

Venkatesh: స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఇటీవల చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ, తన ఏజ్‌కు తగ్గ పాత్రలను చేస్తూ ప్రేక్షకుల్లో తనదైన ఇంప్రెషన్‌ను క్రియేట్ చేస్తున్నాడు. కేవలం యంగ్ లుక్‌తోనే కాకుండా ఏజ్ మీద పడ్డ లుక్‌తోనూ అల్ట్రా స్టైలిష్ హీరోగా పేరుతెచ్చుకున్నాడు ఈ దగ్గుబాటి హీరో. ఇక తాజాగా వెంకీ నటించిన ఎఫ్3 మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమా రిలీజ్ రోజునే మంచి రెస్పాన్స్‌ను దక్కించుకోవడంతో, ఎఫ్3 మూవీ వసూళ్ల పరంగా కూడా మంచి కలెక్షన్లు రాబడుతోంది.

Venkatesh: మరో రెండు ప్రాజెక్టులకు వెంకీ సై!

ఇక ఈ సినిమాలో వెంకీ చేసిన కామెడీకి ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుతున్నారు. అయితే ఈ సినిమా ఈ సినిమా తరువాత వెంకటేష్ తన నెక్ట్స్ చిత్రాలను ఇటీవల అనౌన్స్ చేశాడు. తన నెక్ట్స్ రెండు సినిమాలను మైత్రీ మూవీ మేకర్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లలో చేయబోతున్నట్లు వెంకీ తెలిపాడు. అయితే ఈ సినిమాలు ఇప్పట్లో పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదని తెలుస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రాబోయే సినిమాను తొలుత ప్రారంభించేందుకు వెంకీ ఆసక్తిగా ఉన్నాడు.

Venkatesh: జాతిరత్నాలు డైరెక్టర్‌తో వెంకటేష్ మూవీ..?

కానీ ఈ సినిమాను ఆగస్టు నెలాఖరున ప్రారంభించేందుకు వెంకీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న ‘కబీ ఈద్ కబీ దివాలీ’లో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ను త్వరలో ప్రారంభించి, ఆగస్టు నాటికి పూర్తి చేయాలని వెంకీ భావిస్తున్నాడు. ఇక సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో రాబోయే సినిమాను జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ తెరకెక్కించబోతున్నాడు.