Venkatesh: జాతిరత్నాలు డైరెక్టర్‌తో వెంకటేష్ మూవీ..?

టాలీవుడ్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘జాతిరత్నాలు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే సక్సెస్‌ను సొంతం చేసుకోవడమే.....

Venkatesh: జాతిరత్నాలు డైరెక్టర్‌తో వెంకటేష్ మూవీ..?

Venkatesh To Team Up With Anudeep

Venkatesh: టాలీవుడ్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘జాతిరత్నాలు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే సక్సెస్‌ను సొంతం చేసుకోవడమే కాకుండా వసూళ్ల వర్షం కురిపించింది. యంగ్ డైరెక్టర్ అనుదీప్ తెరకెక్కించిన ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రావడంతో ఈ సినిమాను ప్రేక్షకులు పూర్తిగా ఎంజాయ్ చేశారు. ఇక సినిమాలో నటించిన హీరో నవీన్ పోలిశెట్టికి ఇదొక మేజర్ బ్రేక్ ఇచ్చిందని చెప్పాలి. కాగా ఈ సినిమాను దర్శకుడు అనుదీప్ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.

ఇక జాతిరత్నాలు తరువాత అనుదీప్ ఇప్పటివరకు తన నెక్ట్స్ సినిమాను ఇంకా స్టార్ట్ చేయలేదు. అయితే ఆ మధ్య ఈ డైరెక్టర్ ఓ తమిళ స్టార్ హీరోతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడని.. దానికి సంబంధించిన సంప్రదింపులు కూడా జరిగాయనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొట్టాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదని అనుదీప్ తెలిపాడు. కాగా తాజాగా అనుదీప్ టాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్ హీరోతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

Anudeep : అసలైన ‘జాతిరత్నం’ అనుదీప్ పాన్ ఇండియా మూవీ..

ఇప్పటికే ఓ అద్భుతమైన కథను కూడా అనుదీప్ రెడీ చేశాడట. ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు విక్టరీ వెంకటేష్‌కు పర్ఫెక్ట్‌గా సరిపోయే ఓ కామెడీ జోనర్ కథను రెడీ చేశాడట ఈ డైరెక్టర్. త్వరలోనే వెంకటేష్‌ను కలిసి ఈ కథను ఆయనకు వినిపించేందుకు సిద్ధమవుతున్నాడట ఈ డైరెక్టర్. ఇక ఈ సినిమాతో మరోసారి జాతిరత్నాలు మ్యాజిక్‌ను రీక్రియేట్ చేసేందుకు ఈ డైరెక్టర్ ప్రయత్నాలు మొదలుపెడుతున్నాడని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Venkatesh : బాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తున్న వెంకీమామ

మరి నిజంగానే వెంకటేష్ లాంటి స్టార్ హీరోకు సెట్ అయ్యే కథను ఈ యంగ్ డైరెక్టర్ రెడీ చేశాడా.. ఒకవేళ అది వెంకటేష్‌కి నచ్చకపోతే ఏమిటి పరిస్థితి.. అనే ప్రశ్నలు పలువురిలో మెదులుతున్నాయి. అయితే వెంకటేష్ గనక ఈ డైరెక్టర్‌కు ఓకే చెబితే మాత్రం మరో పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్ మూవీని మనం త్వరలోనే చూడటం ఖాయమని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.