Anudeep : అసలైన ‘జాతిరత్నం’ అనుదీప్ పాన్ ఇండియా మూవీ..

‘జాతిరత్నాలు’.. నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా మెయిన్ లీడ్స్‌గా అనుదీప్ డైరెక్ట్ చేయగా ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా చిన్న సినిమాగా విడుదలై తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ సూపర్ డూపర్ హిట్ టాక్‌తో కళ్లుచెదిరే కలెక్షన్లతో దూసుకెళ్తోంది.

Anudeep : అసలైన ‘జాతిరత్నం’ అనుదీప్ పాన్ ఇండియా మూవీ..

Jathi Rathnalu Director Anudeep Planning To Pan India Movie Dd

Anudeep : ‘జాతిరత్నాలు’.. నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా మెయిన్ లీడ్స్‌గా అనుదీప్ డైరెక్ట్ చేయగా ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా చిన్న సినిమాగా విడుదలై తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ సూపర్ డూపర్ హిట్ టాక్‌తో కళ్లుచెదిరే కలెక్షన్లతో దూసుకెళ్తోంది. సినిమాలో నవీన్, రాహుల్, ప్రియదర్శి ‘జాతిరత్నాలు’ అయితే, ఆ క్యారెక్టర్లని క్రియేట్ చేసిన అసలైన ఆణిముత్యం డైరెక్టర్ అనుదీప్.. మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసినప్పటినుండి ఇచ్చిన ప్రతి ఇంటర్వూలోనూ అనుదీప్ చేసిన రచ్చ మాములుగా లేదు, అంత త్వరగా మర్చిపోలేం కూడా..

Jathi Rathnalu

టెన్త్‌లో క్లాస్ టాపర్, పీహెచ్‌డీ చెయ్యాలనుకున్నా కానీ పీజీ కాలేదు, ఎరోనాటికల్ ఇంజనీర్.. ఇలా ఇంటర్వూ చేసే వాళ్లకి చూసే వాళ్లకి పిచ్చెక్కించేశాడు అనుదీప్. పబ్లిక్ ఫంక్షన్స్‌లోనూ అనుదీప్ స్టడీ గురించి టాపిక్ వస్తే ఆడియెన్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. అప్పటినుండి తనని బేస్ చేసుకుని పలు మీమ్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

Faria Abdullah : టాలీవుడ్ టాలెస్ట్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా.. అమ్మడి డ్రీమ్ రోల్ ఏంటంటే..

ఒక యాంకర్ మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా, ఎరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారా అనడిగితే రిజిస్టర్ మ్యారేజ్ అని పంచ్ ఇవ్వడం, అలానే మీ తర్వాతి సినిమా ఏంటని అడిగితే పాన్ ఇండియా మూవీ అని చెప్పడం.. ఎన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారనడిగితే, సినిమా పేరే ‘పాన్ ఇండియా’ అని దిమ్మతిరిగేలా ఆన్సర్ ఇచ్చాడు. చూడ్డానికిలా కనిపిస్తాడు కానీ అనుదీప్ పాన్ ఇండియా సినిమా చేసినా చేస్తాడు.. అంటూ ‘జాతి రత్నాలు’ స్టైల్లో లాఫింగ్ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

Jathi Rathnalu