Telangana Heat Wave : నిప్పుల కొలిమిలా రాష్ట్రం.. అక్కడ 45.9 డిగ్రీల ఎండ.. మరో 4 రోజులు బయటకు రావొద్దు.. 15 జిల్లాలకు రెడ్ అలర్ట్..
Telangana Heat Wave : రాష్ట్రం నిప్పుల కొలిమిలా మండిపోతుంది. మరో నాలుగు రోజులు ఇదే పరిస్థితి అని.. జనాలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.
Telangana 45 9 degrees temparature recorded heat wave continues 4 days red alert to few districts
- 12 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగానే టెంపరేచర్లు
- అత్యధికంగా జగిత్యాల జిల్లాలో 45.9 డిగ్రీలు
- మరో 4 రోజులు 15 జిల్లాలకు రెడ్ అలర్ట్
Telangana Heat Wave : భానుడి ప్రతాపంతో రాష్ట్రం నిప్పుల కొలిమిలా మండుతున్నది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరోసారి రెడ్‌జోన్‌లోకి వెళ్లాయి. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా ఇలాపూర్లో అయితే ఏకంగా 45.9 డిగ్రీల అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలానే నల్గొండ జిల్లా కట్టంగూర్, నిర్మల్ జిల్లా దస్తూరాబాద్, సిద్దిపేట జిల్లా శనిగరంలో మంగళవారం నాడు 45.8 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇదిలా ఉంటే..
- మంచిర్యాల జిల్లా వెల్గనూరు, పెద్దపల్లి జిల్లా ఎలిగేడులో 45.7 డిగ్రీలు,
- కామారెడ్డి జిల్లా బోమన్దేవిపల్లి, ఆదిలాబాద్ జిల్లా రాంనగర్, నిజామాబాద్ జిల్లా భీంగల్, కరీంనగర్ జిల్లా గంగాధర, రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరులో 45.6 డిగ్రీలు,
- కుమ్రం భీం జిల్లా సిర్పూరులో 45.5 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మరో 10 జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా రికార్డయ్యాయి.
- ఖమ్మం జిల్లా తిమ్మారావుపేట, హనుమకొండ జిల్లా పెద్దపెండ్యాల్, సూర్యాపేట జిల్లా రఘునాథపాలెంలో 44.8 డిగ్రీలు,
- మెదక్ జిల్లా కాగజ్ మద్దూరు, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు, ములుగు జిల్లా గోవిందరావుపేటలో 44.5 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
- వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లోనూ 44 డిగ్రీలకు పైగానే రికార్డయ్యాయి.
నగరంలోనూ భగభగ..
హైదరాబాద్ నగరంలో కూడా మంగళవారం మాడుపగిలే ఎండతో జనాలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. మూడు సర్కిళ్లు తప్ప మిగతా అన్ని సర్కిళ్లలోనూ 42 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ నగరంలో మంగళవారం
- కుత్బుల్లాపూర్‌లో 42.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.
- చందానగర్‌లో 42.6,
- రాజేంద్రనగర్, హయత్‌నగర్, సంతోష్‌నగర్, మల్కాజిగిరిలో 42.4,
- అంబర్‌పేట, ముషీరాబాద్, బేగంపేట, గాజులరామారం, మూసాపేట, సరూర్ నగర్ సర్కిళ్లలో 42.3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మరో నాలుగు రోజులపాటు రాష్ట్రంలో వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంటుందని ఐఎండీ వెల్లడించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఖమ్మం, నల్లగొండ, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాలు సహా మొత్తంగా 15 జిల్లాలకు రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది. రానున్న 4 రోజులు జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ అధికారులు సూచిస్తున్నారు.
