Filing ITR : ఐటీ కొత్త రూల్స్.. జూన్ 15కు ముందు ITR ఫైల్ చేయొద్దని నిపుణుల హెచ్చరిక.. కారణం ఇదే!
Filing ITR : మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను జూన్ 15వ తేదీకి ముందు దాఖలు చేయొద్దు. లేదంటే లేనిపోని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు.. మీకు ఐటీ శాఖ నుంచి నోటీసులు కూడా రావొచ్చు.. ఏం చేయాలంటే?
Filing ITR ( Illustration generated using AI )
- టాక్స్ పేయర్లు తొందరపడి ఐటీఆర్ ఫైలింగ్ చేయొద్దు
- జూన్ 15వ తేదీకి ముందే ఐటీఆర్ ఫైల్ చేస్తే జరిగేది ఇదే
- మీరు చేసే ఈ తప్పులకు ఐటీ శాఖ నుంచి నోటీసులు రావొచ్చు
Filing ITR : టాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్.. ఐటీఆర్ దాఖలు సమయం దగ్గర పడుతోంది. ఏప్రిల్ 1నే ఐటీ పోర్టల్ ఓపెన్ అయింది. అయితే, మీ ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసేందుకు ప్లాన్ చేస్తుంటే జర జాగ్రత్త. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గడువు జూలై 31, 2026 వరకు ఉంది. కానీ, చాలా మంది తొందరపాటుతో ఏప్రిల్ లేదా మే నెలల్లోనే తమ రిటర్న్‌లను దాఖలు చేస్తారు.
ఈ తొందరపాటు కారణంగా భారీగా నష్టపోయే అవకాశం ఉంటుందని టాక్స్ ఎక్స్ పర్ట్స్ (Filing ITR) హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి, జూన్ 15 కన్నా ముందు రిటర్న్‌లను దాఖలు చేయడం టెక్నికల్‌గా రిస్క్ ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. మరి టాక్స్ పేయర్లు ఏం చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
జూన్ 15 వరకు ఎందుకు ఆగాలి? :
రిటర్న్‌లను ఫైలింగ్ కోసం ఫారం 26AS, AIS ముఖ్యమైన డాక్యుమెంట్లు. బ్యాంకులు, కంపెనీలు మీ పన్ను (TDS) సమాచారాన్ని ఐటీ శాఖకు సమర్పించేందుకు మే 31వ తేదీ వరకు గడువు ఉంది.
కంపెనీలు డేటాను అప్లోడ్ చేసినప్పటికీ, మీ ప్రభుత్వ రికార్డులలో అది పూర్తిగా అప్డేట్ అయ్యేందుకు జూన్ 15వ తేదీ వరకు పడుతుందని నిపుణులు అంటున్నారు. మీరు అంతకన్నా ముందు మీ రిటర్న్‌ను దాఖలు చేస్తే సమాచారం అసంపూర్ణంగా ఉండొచ్చు.
Read Also : Post Office FD : పోస్టాఫీసు FDలో రూ. 2 లక్షలు పెడితే 3 ఏళ్లకు ఎంత వడ్డీ వస్తుంది? పూర్తి లెక్క ఇదే!
ఈ వ్యక్తులకు రిస్క్ ఎక్కువ :
ఒకటి కన్నా ఎక్కువ ఆదాయ వనరులు ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తగా ఉండాలి. మీరు స్టాక్ మార్కెట్, వడ్డీ లేదా వ్యాపారం నుంచి ఆదాయం సంపాదిస్తుంటే.. మీ డేటా అప్డేట్ అయ్యేందుకు సమయం పడుతుంది.
బ్యాంకులు తరచుగా తమ రిపోర్టులను తర్వాత సవరణలు చేస్తాయి. మీరు అందించిన డేటాకు ఐటీ శాఖ వద్ద అందుబాటులో ఉన్న డేటాకు మధ్య తేడా ఉంటే మీ రిటర్న్ ఆలస్యం కావచ్చు. మీరు మళ్లీ సరిదిద్దుకోవలసి వస్తుంది.
నోటీసులు, రీఫండ్లలో జాప్యం వద్దు :
మీరు తొందరపడి తప్పుడు లేదా పూర్తిగా లేని వివరాలను ఫైల్ చేయొద్దు. ఆదాయపు పన్ను శాఖ మీకు నోటీసులు పంపవచ్చు. అలాగే, మీ ఫైలింగ్ డేటా మ్యాచ్ కాకపోయినా మీ రీఫండ్ నిలిచిపోతుంది.
అందుకే జూన్ 15వ తేదీ తర్వాత మీ డేటా అంతా పోర్టల్‌లో కనిపిస్తే.. అప్పుడు మీ రిటర్న్‌ను ప్రశాంతంగా ఫైల్ చేయడం బెటర్. తద్వారా నోటీసుల భయంతో పాటు రీఫండ్ విషయంలో టెన్షన్ ఉండదు.
