Post Office FD : పోస్టాఫీసు FDలో రూ. 2 లక్షలు పెడితే 3 ఏళ్లకు ఎంత వడ్డీ వస్తుంది? పూర్తి లెక్క ఇదే!
Post Office FD : పోస్టాఫీసులో TD లేదా FD అకౌంట్ ఓపెన్ చేసేందుకు ఎక్కువ ఆప్షన్లు లేవు. టీడీ అకౌంట్ కాలపరిమితికి కేవలం 4 ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
Post Office FD ( Illustration generated using AI )
- పోస్టాఫీసులో అద్భుతమైన ఎఫ్డీ స్కీమ్స్
- 36 నెలల FDలో ఎంత డిపాజిట్ చేస్తే ఎంత వడ్డీ?
- బ్యాంకుల కన్నా పోస్టాఫీసులోనే ఎక్కువ వడ్డీ వస్తుందా?
Post Office FD : పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే.. భారతీయ తపాలా శాఖ తపాలా సేవలతో పాటు అనేక రకాల బ్యాంకింగ్ సేవలను కూడా అందిస్తోంది. బ్యాంకుల పథకాల కన్నా పోస్టాఫీస్ అందించే అనేక సేవింగ్స్ పథకాలు ఎక్కువగా పాపులర్ అయ్యాయి.
అంతేకాదు.. పోస్టాఫీస్ పథకాలు బ్యాంకుల కన్నా అధిక వడ్డీ రేట్లను (Post Office FD) అందిస్తాయి. పోస్టాఫీస్‌లో 36 నెలల ఎఫ్డీలో రూ. 2 లక్షలు డిపాజిట్ చేస్తే.. మీకు ఎంత వడ్డీ వస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
పోస్టాఫీస్ ఎఫ్డీలో టైమ్ డిపాజిట్లు బ్యాంకు ఎఫ్‌డీల మాదిరిగానే ఉంటుంది. అయితే, పోస్టాఫీసులో టీడీ అకౌంట్ కాలపరిమితికి సంబంధించి కేవలం 4 ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. టీడీ లేదా ఎఫ్డీలో అకౌంట్ ఓపెన్ చేసేందుకు ఎక్కువ ఆప్షన్లు ఉండవు. టీడీ అకౌంట్ కాలపరిమితికి కేవలం 4 ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. టీడీ అకౌంట్లను ఒక ఏడాది, 2 ఏళ్లు, 3 ఏళ్లు, 5 ఏళ్ల కాలపరిమితితో ఓపెన్ చేయొచ్చు.
బ్యాంకుల్లో కనీసం 7 రోజుల నుంచి గరిష్టంగా 10 ఏళ్ల వరకు ఎఫ్డీ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. అయితే, బ్యాంకు ఎఫ్‌డీల కన్నా పోస్టాఫీసు టీడీ ఖాతాలపై అధిక వడ్డీ రేట్లను అందిస్తుంది. పోస్టాఫీసు ఒక ఏడాది టీడీపై 6.9 శాతం, 2ఏళ్ల టీడీపై 7.0 శాతం, 3ఏళ్ల టీడీపై 7.1 శాతం, 5ఏళ్ల టీడీపై 7.5 శాతం భారీ వడ్డీ రేటును అందిస్తుంది.
36 నెలల ఎఫ్డీలో రూ. 2లక్షలు డిపాజిట్.. వడ్డీ ఎంతంటే? :
పోస్టాఫీసులో 3 ఏళ్లు (36 నెలల) FD ఖాతాలో రూ. 2 లక్షలు డిపాజిట్ చేయండి. మెచ్యూరిటీతో రూ. 47,015 ఫిక్స్డ్ వడ్డీతో సహా మొత్తం రూ. 2,47,015 రాబడి వస్తుంది. పోస్టాఆఫీసు కస్టమర్లు అన్ని వయస్సుల వారు టైమ్ డిపాజిట్ లేదా ఫిక్స్ డ్ డిపాజిట్ ఖాతాలపై ఒకే రకమైన వడ్డీని పొందవచ్చు.
కానీ, బ్యాంకులలో, సీనియర్ సిటిజన్ల కోసం అందించే ఎఫ్డీ పథకాలపై 0.50శాతం ఎక్కువ వడ్డీ వస్తుంది. 80 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు కూడా అధిక మొత్తంలో వడ్డీ రేట్లను పొందవచ్చు.
