Bichagadu 2 : ‘బిచ్చగాడు’కి కలిసొచ్చిన 2 వేల నోటు రద్దు.. మొదటిరోజు కలెక్షన్స్ అదుర్స్!

విజయ్ అంటొంట్ బిచ్చగాడు 2 మొదటిమోజు కలెక్షన్స్ మాములుగా లేవుగా. మూవీ టీంకి ఖర్చు లేకుండా ఈ సినిమాని మీమర్స్ ఫ్రీ పబ్లిసిటీతో ఆడియన్స్ లోకి తీసుకు పోతున్నారు.

Bichagadu 2 : ‘బిచ్చగాడు’కి కలిసొచ్చిన 2 వేల నోటు రద్దు.. మొదటిరోజు కలెక్షన్స్ అదుర్స్!

Vijay Antony Bichagadu 2 first day collections is more than PS2

Vijay Antony Bichagadu 2 : తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటించిన ‘బిచ్చగాడు’ తెలుగులో ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2016లో రిలీజ్ అయిన ఆ సినిమా తెలుగులో 100రోజులు ఆడి రికార్డ్ కూడా క్రియేట్ చేసింది. అలాగే కలెక్షన్స్ పరంగా కూడా సంచలనమే సృష్టించింది. తెలుగులో 15 కోట్ల కలెక్షన్స్ అందుకొని బయ్యర్లకు ఏకంగా 13 కోట్ల లాభాలు మిగిల్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ ని విజయ్ ఆంటోనీ తీసుకు వస్తుండడంతో టాలీవుడ్ లో కూడా భారీ అంచనాలే ఏర్పడ్డాయి.

Suriya : తెలుగు అమ్మాయి మృతి.. తమిళ హీరో సూర్య ఎమోషనల్.. ఆ కుటుంబానికి లేఖ!

ఈ సీక్వెల్ నిన్న (మే 19) ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇక ముందు నుంచే మంచి అంచనాలు ఉండడంతో మొదటిరోజే భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఫస్ట్ డేనే దాదాపు 4 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకొని సంచలనం సృష్టించింది. ఇటీవల రిలీజ్ అయిన పాన్ ఇండియా మూవీ పొన్నియిన్ సెల్వన్ కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ అందుకోలేక పోయాయి. అంతేకాదు తెలుగులోని కొందరు మీడియా హీరో సినిమాలు కూడా మొదటి రోజు ఇంతటి కలెక్షన్స్ ని రాబట్టలేక పోయాయి. దీని బట్టి చూస్తూనే తెలుస్తుంది బిచ్చగాడు మ్యానియా తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ లో ఉందో.

Adipurush : ఆదిపురుష్ నుంచి జై శ్రీ రామ్ సాంగ్ రిలీజ్.. వింటే గూస్‌బంప్స్ గ్యారెంటీ..

ఇది ఇలా ఉంటే, నిన్న జరిగిన 2 వేల నోటు రద్దు ఈ సినిమా ప్రమోషన్స్ కలిసొచ్చింది. రూపాయి ఖర్చు లేకుండా సోషల్ మీడియా మీమర్స్ ఈ సినిమాని ప్రమోట్ చేసేస్తున్నారు. బిచ్చగాడు 1 రిలీజ్ అయిన సమయంలో కూడా నోటు రద్దు జరిగిందని, ఇప్పుడు నోటు రద్దు జరిగిందని మీమ్స్ వేస్తూ.. బిచ్చగాడు 2 ని టైం లైన్ లో ఉంచుతున్నారు. దీంతో బిచ్చగాడు 2 టీం కష్టపడకుండానే ఫ్రీ పబ్లిసిటీ వచ్చేస్తుంది. మరి ఫుల్ రన్ లో ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.