Suriya : తెలుగు అమ్మాయి మృతి.. తమిళ హీరో సూర్య ఎమోషనల్.. ఆ కుటుంబానికి లేఖ!

ఇటీవల (మే 6) అమెరికా టెక్సాస్‌లోని జరిగిన కాల్పుల్లో ఐశ్వర్య తాటికొండ అనే తెలుగు అమ్మాయి చనిపోయిన విషయం తెలిసిందే. ఆమె సూర్య అభిమాని కావడంతో.. ఆమె కుటుంబానికి లేఖ రాశాడు సూర్య.

Suriya : తెలుగు అమ్మాయి మృతి.. తమిళ హీరో సూర్య ఎమోషనల్.. ఆ కుటుంబానికి లేఖ!

Kanguva star Suriya letter to texas firing victim Aiswarya family

Kanguva Suriya : తమిళ స్టార్ హీరో సూర్యకి తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. అలా సూర్యకి అభిమాని అయిన ఒక యువతి.. ఇటీవల (మే 6) అమెరికాలో జరిగిన ఒక ఘటన వలన హఠాన్మరణం చెందింది. ఐశ్వర్య తాటికొండ అనే యువతి టెక్సాస్‌లోని (Texas) ఓ మాల్‌లో జరిగిన కాల్పుల్లో మృతి చెందిన విషయం అందరికి తెలిసిన విషయమే. అయితే ఆ యువతి సూర్యకి అభిమాని అంటా. ఈ విషయం తెలుసుకున్న సూర్య ఎమోషనల్ అయ్యాడు. భావోద్వేగానికి గురైన సూర్య ఐశ్వర్య చిత్ర పటానికి శ్రద్ధాంజలి ఘటించాడు.

Suriya – Prithviraj Sukumaran : పృథ్వీరాజ్ డైరెక్షన్‌లో సూర్య మరో బయోపిక్.. నిజమేనా?

అంతేకాదు ఐశ్వర్య కుటుంబానికి సానుభూతి తెలుపుతూ ఓ లేఖను కూడా రాశాడు. “మీ కుటుంబాన్ని ఎలా ఓదార్చాలో నాకు తెలియడం లేదు. టెక్సాస్‌లో జరిగిన ఘటనలో మీ కుమార్తె కన్నుమూయడం దురదృష్టకరం. ఐశ్వర్య మరణం మనందరికీ తీరని లోటు. ఆమె మన జ్ఞాపకాల్లో ఎప్పటికి నిలిచిపోతుంది. ఆకాశంలో ధ్రువతారలా వెలుగుతూనే ఉంటుంది” అంటూ ఆ కుటుంబాన్ని ఓదార్చే ప్రయత్నం చేశాడు.

Kanguva: కంగువా నుండి ఫస్ట్ సింగిల్ సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

అలాగే ఐశ్వర్య గురించి మాట్లాడుతూ.. “ఈ లేఖలో రాస్తున్న అక్షరాలు నీ మరణం గురించి కాదు. నీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి నువ్వొక ధ్రువతారవి. చిరునవ్వు చిందిస్తూ, ప్రేమని పంచుతూ ప్రతి ఒక్కరి మనసు దోచుకున్నావు. నువ్వు ఒక హీరో” అంటూ పేర్కొన్నాడు. సూర్య, ఐశ్వర్య శ్రద్ధాంజలి ఘటిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇక సూర్య సినిమాలు విషయానికి వస్తే.. ప్రస్తుతం తన 42వ సినిమాలో నటిస్తున్నాడు. శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఆ సినిమాకి కంగువా (Kanguva) అనే టైటిల్ ని ఖరారు చేశారు. సూర్య వారియర్ గా నటిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. దిశా పటాని (Disha Patani) హీరోయిన్ గా నటిస్తుంది.

Kanguva star Suriya letter to texas firing victim Aiswarya family

Kanguva star Suriya letter to texas firing victim Aiswarya family