Vijay : 1990లో ఆ నటుడు నాకు గట్టి పోటీ ఇచ్చాడు.. విజయ్!

ఇళయ దళపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం 'వారిసు'. ఈ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ డిసెంబర్ 24న చెన్నైలో ఘనంగా జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో హీరో విజయ్ మాట్లాడుతూ.. 1990లో ఒక నటుడు తనకి పోటీ వచ్చినట్లు వెల్లడించాడు. ఇప్పటి వరకు ఇంకా ఆ నటుడు తనకి గట్టి పోటిస్తూ, బలమైన ప్రత్యర్థిగా ఉన్నాడు అని తెలియజేశాడు.

Vijay : 1990లో ఆ నటుడు నాకు గట్టి పోటీ ఇచ్చాడు.. విజయ్!

Vijay comments about his competitor

Vijay : ఇళయ దళపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వారిసు’. తెలుగు స్టార్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా తెలుగులో ‘వారసుడు’ టైటిల్‌తో విడుదల కానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నాడు. ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో
సౌత్ స్టార్ హీరోయిన్ రష్మిక మందాన, విజయ్ కి జంటగా నటిస్తుంది.

Varisu: విజయ్ సినిమాకు అంత లెంగ్తీ రన్‌టైమా.. ఆడియెన్స్ అంగీకరిస్తారా..?

ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ డిసెంబర్ 24న చెన్నైలో ఘనంగా జరిగింది. చెన్నై నెహ్రు ఇండోర్ స్టేడియం జరిగిన ఈ ఈవెంట్‌కి భారీగా అభిమానులు హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో హీరో విజయ్ మాట్లాడుతూ.. 1990లో ఒక నటుడు తనకి పోటీ వచ్చినట్లు వెల్లడించాడు. ఇప్పటి వరకు ఇంకా ఆ నటుడు తనకి గట్టి పోటిస్తూ, బలమైన ప్రత్యర్థిగా ఉన్నాడు అని తెలియజేశాడు.

“నేను ఎక్కడికి వెళ్లిన అతను నాకు గట్టి పోటీ ఇస్తూనే వస్తున్నాడు. అతన్ని గెలవడానికి నేను చాలా కష్టపడ్డా, కష్టపడుతున్న. ఆ నటుడు పేరే జోసఫ్ విజయ్” అని తెలియజేశాడు. అయితే జోసఫ్ విజయ్ అనేది విజయ్ అసలు పేరు. ఎవరికి వారే పోటీ కావాలి.. అలా తమకి తామే పోటీ అనుకుంటే మేరే నెంబర్ వన్ అంటూ అభిమానులకు వెల్లడించాడు. అయితే విజయ్ ఈ వ్యాఖ్యలు, ప్రస్తుతం జరుగుతున్న ‘అజిత్ వర్సెస్ విజయ్’ కాంట్రవర్సిని చల్లబరిచాలి అనే ఉద్దేశం చేసినట్లు తెలుస్తుంది.