Varisu: విజయ్ సినిమాకు అంత లెంగ్తీ రన్‌టైమా.. ఆడియెన్స్ అంగీకరిస్తారా..?

తమిళ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వారిసు’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తుండగా, అందాల భామ రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, లిరికల్ సాంగ్స్ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేశాయి.

Varisu: విజయ్ సినిమాకు అంత లెంగ్తీ రన్‌టైమా.. ఆడియెన్స్ అంగీకరిస్తారా..?

Vijay Varisu To Have Lengthy Runtime

Varisu: తమిళ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వారిసు’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తుండగా, అందాల భామ రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, లిరికల్ సాంగ్స్ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేశాయి.

Varisu: వారసుడి కోసం సీఎం రాక.. విజయ్ అంటే ఆమాత్రం ఉండాల్సిందే!

కాగా, ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు సంబంధించిన రన్‌టైమ్‌ను చిత్ర యూనిట్ లాక్ చేసిందట. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న వారిసు చిత్ర రన్‌టైమ్‌ను ఏకంగా 2 గంటల 43 నిమిషాలుగా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఒక కమర్షియల్ సినిమాకు ఇది కాస్త ఎక్కువ రన్‌టైమ్ అని చెప్పాలి. కానీ, విజయ్ లాంటి క్రేజీ హీరో ఉన్న సినిమా కాబట్టి అభిమానులు అయితే ఈ సినిమాను చూస్తారు. మరి కామన్ ఆడియెన్స్ పరిస్థితి ఏమిటనేది ఇప్పుడు సందేహంగా మారింది.

Varisu: ‘వారసుడు’కి గట్టి పోటీనిస్తున్న సీనియర్ హీరోలు!

ఒకవేళ కంటెంట్‌లో వైవిధ్యం ఉండి.. ప్రేక్షకులను థియేటర్లలో కూర్చోబెట్టగలిగితేనే ఈ రన్‌టైమ్‌ను ఫిక్స్ చేయాలని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇక స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండగా, తెలుగులో వారసుడు అనే టైటిల్‌తో ఈ సినిమాను రిలీజ్ చేస్తోంది చిత్ర యూనిట్. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, సంక్రాంతి బరిలో జనవరి 12న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యనిట్ రెడీ అయ్యింది.