VD12 : విజయ్ దేవరకొండ సినిమా పై నెటిజెన్ కామెంట్.. నిర్మాత కౌంటర్ ట్వీట్!

విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వస్తున్న VD12 హాలీవుడ్ మూవీకి కాపీ అంటూ పోస్ట్ వైరల్. క్లారిటీ ఇచ్చిన నిర్మాత నాగవంశీ.

VD12 : విజయ్ దేవరకొండ సినిమా పై నెటిజెన్ కామెంట్.. నిర్మాత కౌంటర్ ట్వీట్!

Vijay Deverakonda VD12 poster is copied from hollywood movie

VD12 : విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తన 12వ సినిమాని గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కించబోతున్నట్లు తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ పూజా కార్యక్రమాలతో అఫిషియల్ గా లాంచ్ అయ్యింది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. శ్రీలీల (Sreeleela) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ ఖుషీ షూటింగ్ లో ఉన్నాడు. ఆ మూవీ వర్క్ మొత్తం పూర్తి చేసిన తరువాత గౌతమ్ తిన్ననూరి మూవీ పై కంప్లీట్ ఫోకస్ పెట్టనున్నాడని తెలుస్తుంది.

Vijay Devarakonda: గ్లోబల్ స్టార్‌కు రౌడీ స్టార్ థ్యాంక్స్.. ఎందుకంటే..?

ఇక నిన్న (మే 9) విజయ్ బర్త్ డే కావడంతో ఈ మూవీ నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ చూసిన ఒక నెటిజెన్.. VD12 హాలీవుడ్ మూవీ అర్గో (Argo) కి కాపీ అంటూ ట్వీట్ చేశాడు. ఈ రెండు సినిమాల పోస్టర్స్  ఒకేలా ఉండడమే కాకుండా స్టోరీ లైన్ కూడా స్పై యాక్షన్ నేపథ్యంతో కావడంతో విజయ్ మూవీ అర్గోకి ఫ్రీ మేక్ అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్ కి నిర్మాత నాగవంశీ రిప్లై ఇస్తూ.. “మేము ఏ పోస్టర్ నుంచి కాపీ కొట్టలేదు. కథ బట్టి పోస్టర్ అలా కావాలి అనుకున్నాము. యాదృచ్చికంగా అర్గో పోస్టర్ కూడా అలా ఉంది అంతే” అంటూ చెప్పుకొచ్చాడు.

Project K : ప్రభాస్ ప్రాజెక్ట్ K పోస్ట్‌పోన్.. రీజన్ అదేనట!

అటువంటి సినిమా పోస్టర్ మరికొన్ని షేర్ చేస్తూ.. “ఈ పోస్టర్లు అన్ని కూడా ఒకేలా ఉన్నాయి. కానీ వాటి కథ కాపీ కాదు కదా. మా సినిమా కూడా అంతే. పోస్టర్ బట్టి ఒక అంచనాకి వచ్చేయడం కరెక్ట్ కాదు” అంటూ చెప్పుకొచ్చాడు. నాగవంశీ షేర్ చేసిన పోస్టర్స్ లో తమిళ హీరో కార్తీ సినిమా ఖైదీ పోస్టర్ కూడా ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్స్ అండ్ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.