Vaarasudu: ‘వారసుడు’ రాకతో నిజమైన సంక్రాంతి..!

తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీని దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీగా.....

Vaarasudu: ‘వారసుడు’ రాకతో నిజమైన సంక్రాంతి..!

Vijay Vaarasadu New Poster Creates Interest

Vaarasadu: తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీని దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీగా దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తుండగా, తాజాగా ఈ చిత్ర హీరో విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో సోషల్ మీడియాలో దద్దరిల్లిపోతుంది. ఇప్పటికే ‘వారిసు’ అనే టైటిల్ ను చిత్ర యూనిట్ ఈ సినిమాకు ఫిక్స్ చేయగా, ఈ సినిమాలోని విజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ దక్కుతోంది.

Vijay66: అదిరిపోయే టైటిల్‌తో తిరిగొచ్చిన బాస్!

ఇక ఈ సినిమాకు తెలుగులో ‘వారసుడు’ అనే టైటిల్ ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతోండగా, ఈ సినిమాలో విజయ్ పాత్ర అందరికీ నచ్చేలా ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమా నుండి తాజాగా మరో కొత్త పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో ఓ ట్రాక్టర్ పై పిల్లలతో చాలా కూల్ గా తన సొంత ఊరికి వెళ్లున్న అబ్బాయిలా విజయ్ కనిపించాడు.

Vijay: విజయ్ కోసం నాగ్ టైటిల్‌ను వాడేస్తున్న పైడిపల్లి..?

కాగా ఈ పోస్టర్ తోనే వారసుడు చిత్ర రిలీజ్ డేట్ ను కూడా లాక్ చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమాను ఫ్యామిలీ ఆడియెన్స్ చేసే విధంగా సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా, ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నాడు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ అప్పుడే ధీమా వ్యక్తం చేస్తోంది.