Varisu Trailer: వారిసు ట్రైలర్.. క్లాస్‌కు మాస్ యాక్షన్‌ను జోడించిన విజయ్!

తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వారిసు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తుండగా, ఈ మూవీని ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇక ఈ సినిమాలో విజయ్ లుక్ అల్ట్రా స్టైలిష్‌గా ఉండబోతుందని ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ చూస్తే అర్థమవుతోంది. కాగా, ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారిసు ట్రైలర్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది.

Varisu Trailer: వారిసు ట్రైలర్.. క్లాస్‌కు మాస్ యాక్షన్‌ను జోడించిన విజయ్!

Vijay Varisu Trailer Filled With Class And Mass Elements

Varisu Trailer: తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వారిసు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తుండగా, ఈ మూవీని ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇక ఈ సినిమాలో విజయ్ లుక్ అల్ట్రా స్టైలిష్‌గా ఉండబోతుందని ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ చూస్తే అర్థమవుతోంది. కాగా, ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారిసు ట్రైలర్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది.

Varisu: వారిసు సెన్సార్ టాక్.. విజయ్ ఖాతాలో మరో హిట్టు!

వారిసు ట్రైలర్ చూస్తే.. ఇదొక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీగా కనిపిస్తుంది. వంశీ పైడిపల్లి తనదైన మార్క్ కథతో ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా ఈ ట్రైలర్‌లోనే చూపెట్టాడు. తన ఫ్యామిలీ ప్రతిష్టను కాపాడుకునేందుకు విజయ్ ఎలాంటి బాధ్యతను తీసుకున్నాడు.. ఈ క్రమంలో అతడికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి అనేది మనకు ఈ సినిమా కథలో చూపించబోతున్నారు. ఇక విజయ్ రెండు వైవిధ్యమైన గెటప్స్‌లో మనకు ఈ సినిమాలో కనిపిస్తున్నాడు. అందులో ఒకటి కంపెనీ సీఈఓ పాత్ర కూడా ఉండబోతుందని తెలుస్తోంది.

Varisu Trailer: వారిసు ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన విజయ్

భారీ క్యాస్టింగ్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోండగా, థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఎమోషన్, యాక్షన్ కలగలిసిన ‘వారిసు’ చిత్రాన్ని మనముందుకు తీసుకొస్తున్నాడు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఈ సినిమాపై తమిళ్‌తో పాటు తెలుగులో కూడా మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. సంక్రాంతి బరిలో పలు సినిమాలతో పోటీకి దిగుతున్న ‘వారిసు’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.