Varisu Trailer: వారిసు ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన విజయ్

తమిళ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వారిసు’ ఇప్పటికే అభిమానుల్లో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద విజయ్ మరోసారి దుమ్ములేపబోతున్నాడని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తుండగా, విజయ్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేయగా, తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్‌కు చిత్ర యూనిట్ ముహూర్తం ఫిక్స్ చేసింది.

Varisu Trailer: వారిసు ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన విజయ్

Vijay Varisu Trailer Release Date And Time Locked

Updated On : January 3, 2023 / 7:51 PM IST

Varisu Trailer: తమిళ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వారిసు’ ఇప్పటికే అభిమానుల్లో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద విజయ్ మరోసారి దుమ్ములేపబోతున్నాడని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తుండగా, విజయ్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేయగా, తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్‌కు చిత్ర యూనిట్ ముహూర్తం ఫిక్స్ చేసింది.

Varisu: విజయ్ సినిమాకు అంత లెంగ్తీ రన్‌టైమా.. ఆడియెన్స్ అంగీకరిస్తారా..?

వారిసు ట్రైలర్‌ను రేపు(జనవరి 4న) సాయంత్రం 7 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఈ ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని.. వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ ట్రైలర్ ఉండబోతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాలో విజయ్ పాత్ర ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా చిత్ర యూనిట్ తీర్చిదిద్దినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలోని ఎమోషన్స్, యాక్షన్, అన్ని కూడా ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ అందించే విధంగా ఉండబోతున్నాయట.

Varisu: ‘వారసుడు’కి గట్టి పోటీనిస్తున్న సీనియర్ హీరోలు!

ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తుండగా, తెలుగులో ‘వారసుడు’ అనే టైటిల్‌తో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.