Harish Shankar : ఉస్తాద్ షూటింగ్ లో హరీష్ శంకర్ ని ఇబ్బంది పెట్టిన పవన్ సెక్యూరిటీ.. డిప్యూటీ సీఎం చెప్పినా వినలేదు..
పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ జరిగింది కాబట్టి ఆయనకు ఉండే సెక్యూరిటీ, ప్రొటొకాల్స్ తో షూటింగ్ లో పడ్డ ఇబ్బందుల గురించి తెలిపాడు హరీష్.(Harish Shankar)
Harish Shankar
- ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్స్
- హరీష్ శంకర్ ఇంటర్వ్యూ
- షూటింగ్ లో పవన్ ప్రొటొకాల్స్ తో ఇబ్బంది
Harish Shankar : పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చ్ 26న రిలీజ్ కాబోతుంది. పవన్ డిప్యూటీ సీఎంగా బిజీ ఉంటారని తెలిసిందే. దీంతో మిగిలిన మూవీ యూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ క్రమంలో డైరెక్టర్ హరీష్ శంకర్ తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పవన్ గురించి, సినిమా గురించి అనేక ఆసక్తికర అంశాలు మాట్లాడారు.
అయితే పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ జరిగింది కాబట్టి ఆయనకు ఉండే సెక్యూరిటీ, ప్రొటొకాల్స్ తో షూటింగ్ లో పడ్డ ఇబ్బందుల గురించి తెలిపాడు హరీష్.
Also See : Nayanika Reddy : అల్లు శిరీష్ – నయనిక ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్..
హరీష్ శంకర్ మాట్లాడుతూ.. గతంలో పవన్ సర్ దగ్గరికి వెళ్లాలంటే ఎలా కావాలంటే అలా డైరెక్ట్ గా కారవాన్ లోకి వెళ్ళేవాడిని. ఇప్పుడు వెళ్లాలంటే ప్రోటోకాల్ ఆఫీసర్లు మెటల్ డిటెక్టర్ తో చెక్ చేసి పంపుతున్నారు. రోజూ చూస్తున్నారు కదా ఎందుకు అంటే మా ప్రోటోకాల్ సర్ అనేవాళ్ళు. పొద్దున్నే డాగ్ స్క్వాడ్ వాళ్ళు వచ్చి సెట్ అంతా చెక్ చేస్తారు. ఓ రోజు కళ్యాణ్ గారు కూడా ఆ సెక్యూరిటీ ఆఫీసర్స్ కి మనవాళ్లే కదా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే సర్ ఇది మా ఉద్యోగం అని ఆయన చెప్పినా వినలేదు.
నేనెప్పుడైనా సీన్స్ ఎక్స్ ప్లెయిన్ చేస్తూ కళ్యాణ్ గారి చేయి పట్టుకున్నా, ఆయన్ని జరిపినా వెంటనే నలుగురు సెక్యూరిటీ వాళ్ళు వచ్చేసి అలా చెయ్యి వేయకండి అని అనేవాళ్ళు. బాబు ఇది సినిమా, షూటింగ్ చేయాలి తప్పదు అని చెప్పుకునేవాడ్ని. ఫైట్ సీన్స్ లో అయితే ప్రతి ఫైట్ లో వాడే అన్ని ఆయుధాల్ని చెక్ చేసారు, అవన్నీ డమ్మీ అని చెప్పినా చెక్ చేసారు అని తెలిపారు.
Also Read : Vishwanath And Sons : సూర్య 46 మూవీ టైటిల్ ఇదే.. అదిరిపోయిన ఫస్ట్ లుక్.. జూలైలో ప్రేక్షకుల ముందుకు..
