Iran-Israel war : పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం.. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
Iran-Israel war : పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో తెలంగాణ పౌరుల సహాయం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
Iran-Israel war
Iran-Israel war : మధ్యప్రాచ్యం (పశ్చిమాసియా)లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దాడుల పరంపర కొనసాగుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ పై జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో ఇరాన్ ప్రతీకార దాడులకు పాల్పడుతుంది. ఇజ్రాయెల్ తోపాటు గల్ఫ్ దేశాల్లోనూ క్షిపణులతో దాడులు చేస్తోంది. అబుదాబి, ఖతార్, దుబాయ్, ఒహ్రెయిన్, ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడులకు పాల్పడుతుంది. దీంతో దుబాయ్ నుంచి విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంకు చెందిన అనేక మంది ఆయా ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. ఈ నేఫథ్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్లో రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది.
Also Read : Iran-Israel war : యుద్ధంలోకి మరికొన్ని దేశాలు.. చినికి చినికి వరల్డ్ వార్ అవుతుందా?
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో తెలంగాణ పౌరుల సహాయం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ భవన్ లోని సీనియర్ అధికారులు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖతోపాటు సంబంధిత భారత రాయబార కార్యాలయాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిస్థితులను సమీక్షిస్తున్నారు.
ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న ప్రాంతాల్లో ఉన్న తెలంగాణ పౌరులు, తెలంగాణలో ఉన్న వారి కుటుంబ సభ్యులు.. ఏవైనా ఇబ్బందులు, ప్రయాణ అంతరాయాలు, అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఈ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చు. మధ్యప్రాచ్యం పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉందని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.
24×7 కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు
+919871999044
+919958322143
+919910014749
+919643723157
