Indiramma Indlu: ముగియనున్న ‘ఇందిరమ్మ ఇండ్లు’ దరఖాస్తు ప్రక్రియ.. లాస్ట్ డేట్ ఇదే? వెంటనే అప్లై చేసుకోండి ఇలా!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఇందిరమ్మ గృహ (Indiramma Indlu)పథకం దరఖాస్తు ప్రక్తియ మరో రెండు రోజుల్లో ముగియనుంది.
Telangana indiramma housing scheme application last date and online apply
- ఆరు లక్షలకే ఇందిరమ్మ ఫ్లాట్
- వాట్సాప్‌లో సులభంగా దరఖాస్తు చేసుకోండి
- ఆగస్టు పది చివరి తేదీ
Indiramma Indlu: హైదరాబాద్ నగరంలో సొంతిల్లు నిర్మించుకోవాలనే పేద, మధ్యతరగతి ప్రజల కలను నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ఇందిరమ్మ గృహ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. రోజురోజుకూ పెరిగిపోతున్న ఇళ్ల ధరలు, అద్దెల భారంతో సతమతమవుతున్న వారికి ఇది ఎంతో ఊరట కలిగిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి వంటి 16 కీలక ప్రాంతాల్లో అత్యాధునిక టవర్లలో ఈ ఫ్లాట్ల నిర్మాణం జరగనుంది. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సదవకాశాన్ని అర్హులైన ప్రజలందరూ వినియోగించుకోవడానికి తగిన ఏర్పాట్లు చేశారు.
Holidays: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటినుంచి వరుసగా 3 రోజులు సెలవలు
వాట్సాప్ ద్వారా సులభంగా దరఖాస్తు, ఆగస్టు 10 ఆఖరు తేదీ:
ఈ పథకం కింద కేవలం రూ.6 లక్షలకే ఫ్లాట్ సొంతం(Indiramma Indlu) చేసుకునే వెసులుబాటు ఉంది. దరఖాస్తుదారులు మీసేవ, ఆన్లైన్ పోర్టల్‌తో పాటు ‘8096958096’ నంబర్‌కు వాట్సాప్‌లో మెసేజ్ చేసి కూడా సులభంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము రూ.100 కాగా, డిపాజిట్ కింద రూ.10,000 చెల్లించాల్సి ఉంటుంది. లాటరీలో ఫ్లాట్ రాకపోతే ఈ సొమ్ము తిరిగి ఖాతాలో జమ అవుతుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఆగస్టు 10వ తేదీ దరఖాస్తులకు చివరి తేది కాగా, గడువు పొడిగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
అర్హతలు, నిబంధనల వివరాలు:
*ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వారు గత 10 ఏళ్లుగా హైదరాబాద్ ప్రాంత నివాసి అయి ఉండాలి.
*కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షలకు మించకూడదు.
*ORR పరిధిలో స్వంత ఇల్లు లేదా ప్లాట్ లేని వారు మాత్రమే అర్హులు.
*ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 50% రిజర్వేషన్లు, ప్రతి వర్గంలోనూ మహిళలకు 30% కేటాయించారు.
*ఎంపికైన లబ్ధిదారులు రూ.6 లక్షలను నాలుగు వాయిదాలలో చెల్లించవచ్చు.
*పారదర్శకత కోసం ఈ ఫ్లాట్లను పొందిన తర్వాత 10 సంవత్సరాల వరకు అమ్మడం లేదా అద్దెకు ఇవ్వడం నిషిద్ధం.
