Airtel Roaming Plan : విదేశాలకు వెళ్లే వారికి ఎయిర్టెల్ బిగ్ షాక్.. రోమింగ్ ప్లాన్ భారీగా పెంచేసింది, ధర ఎంతంటే?
Airtel Roaming Plan : విదేశాలకు వెళ్తున్నారా? ఎయిర్టెల్ ఇంటర్నేషనల్ రోమింగ్ ప్రీపెయిడ్ ప్లాన్ ధర పెరిగింది. కొత్త రీఛార్జ్ ప్లాన్ ధర, బెనిఫిట్స్, వ్యాలిడిటీ వివరాలపై ఓసారి లుక్కేయండి.
Airtel Roaming Plan
- ఎయిర్టెల్ ఇంటర్నేషనల్ రోమింగ్ ప్రీపెయిడ్ ప్లాన్ ధర పెంపు
- విదేశాలకు వెళ్లే ప్రయాణికులు రీఛార్జ్ కోసం ఎక్కువ చెల్లించాలి
- అంతర్జాతీయ డేటా, కాల్స్, SMS ఏడాది పాటు వ్యాలిడిటీ
- డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఎక్కడైనా ప్లాన్ బెనిఫిట్స్ పొందవచ్చు
- విదేశీ ప్రయాణాల్లో రోమింగ్ సేవలు ఆటోమాటిక్‌గా యాక్టివేషన్
Airtel Roaming Plan : ఎయిర్టెల్ కస్టమర్లకు షాకింగ్ న్యూస్. ఎయిర్టెల్ ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్ ధర భారీగా పెరిగింది. భారతీ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ గ్లోబల్ ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్ ధరను ఒక్కసారిగా పెంచేసింది. విదేశాలకు వెళ్లే ఎయిర్టెల్ యూజర్లు ఇకపై రోమింగ్ ప్లాన్ కోసం ఎక్కువ ఖర్చు చేయాలి.
గతంలో ఈ ప్యాక్ ధర రూ.4వేలు ఉండగా ఇప్పుడు రూ.4,999కి పెంచింది. అంటే.. దాదాపు 25 శాతం ధర పెరిగింది. 2026లో ఎయిర్టెల్ పెంచిన ఫస్ట్ టారిఫ్ కూడా ఇదే. కొత్త ధరతో ఈ ప్లాన్ ఎయిర్టెల్ రీఛార్జ్ ప్లాట్‌ఫామ్, ఇతర థర్డ్-పార్టీ రీఛార్జ్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది. దేశీయ, అంతర్జాతీయంగా రోమింగ్ ప్లాన్ అవసరమయ్యే యూజర్లకు బెస్ట్ ప్లాన్ అని చెప్పొచ్చు.
ఎయిర్టెల్ రూ. 4,999 ప్లాన్ : (ఇంటర్నేషనల్ బెనిఫిట్స్)
అంతర్జాతీయ రోమింగ్ కింద రూ. 4,999 గ్లోబల్ ప్యాక్ సాధారణ విదేశీ ప్రయాణాలకు కూడా భారీ బెనిఫిట్స్ అందిస్తుంది. వినియోగదారులు విదేశాలలో రోమింగ్ కోసం 5GB డేటాను పొందవచ్చు.
ఈ ప్యాక్‌లో ఇన్కమింగ్, అవుట్గోయింగ్ కాల్స్ కోసం 100 మినిట్స్ కూడా ఉన్నాయి. ఈ కాల్స్ భారత్ లేదా విదేశాల్లో లోకల్ నంబర్లకు చేయవచ్చు. 100 అవుట్గోయింగ్ SMS బెనిఫిట్స్ పొందవచ్చు. అంతర్జాతీయ రోమింగ్ సమయంలో ఇన్కమింగ్ SMS కూడా ఫ్రీగా వస్తాయి. ఈ గ్లోబల్ ప్యాక్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. విదేశాలకు తరచూ వెళ్లివచ్చేవారికి బెస్ట్ రోమింగ్ ప్లాన్.
ఎయిర్టెల్ రూ. 4,999 ప్లాన్ (డొమెస్టిక్ బెనిఫిట్స్) :
ఈ గ్లోబల్ ప్యాక్ స్టాండర్డ్ ప్రీపెయిడ్ బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. కస్టమర్లు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు రోజుకు 1.5GB హై-స్పీడ్ డేటాను పొందవచ్చు. ఈ ప్యాక్ దేశీయ ఉపయోగం కోసం రోజుకు 100 SMS బెనిఫిట్స్ కూడా అందిస్తుంది.
ఈ రోమింగ్ రీఛార్జ్ తర్వాత విదేశాలకు వెళ్తే అంతర్జాతీయ రోమింగ్ బెనిఫిట్స్ ఆటోమాటిక్‌గా యాక్టివేట్ అవుతాయి. నిబంధనల ప్రకారం.. ప్యాక్ రెన్యువల్ చేయకపోతే వ్యాలిడిటీ వ్యవధి ముగిసిన తర్వాత డేటా, కాలింగ్, మెసేజింగ్ సర్వీసులు నిలిచిపోతాయి.
రూ. 4,999 ప్లాన్ ధర పెంపు :
రూ.4,999 ప్రీపెయిడ్ ఇంటర్నేషనల్ ప్లాన్ ధర పెంపుపై ఎయిర్టెల్ ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయలేదు. కొత్త ప్లాన్ ఇంకా లైవ్‌లోనే ఉంది. ఎయిర్టెల్ అధికారిక వెబ్సైట్లలో రీఛార్జ్ ప్లాన్ అందుబాటులో ఉంది.
