Sanju Samson Net Worth 2026 : సంజూ శాంసన్ ఆస్తి ఎంతంటే? కోట్లలో జీతం.. రాజభవనం లాంటి ఇల్లు.!
పలు నివేదికల ప్రకారం 2026 నాటికి సంజూ శాంసన్ నికర ఆస్తి విలువ 85 నుంచి 100 కోట్ల మధ్య (Sanju Samson Net Worth 2026) ఉంటుందని అంచనా.
Do you know Sanju Samsons Net Worth in 2026 report
- పలు నివేదికల ప్రకారం సంజూ శాంసన్ నికర ఆస్తి 85 నుంచి 100 కోట్లు
- ఐపీఎల్ ద్వారానే అత్యధిక సంపాదన
- కేరళలో విలాసవంతమైన ఇల్లు
Sanju Samson Net Worth 2026 : వెస్టిండీస్ పై విజయం సాధించి టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ సెమీస్‌లో అడుగుపెట్టింది. భారత విజయంలో సంజూ శాంసన్ కీలక పాత్ర పోషించాడు. 196 పరుగుల లక్ష్య ఛేదనలో సంజూ శాంసన్ అద్భుతంగా ఆడాడు. 50 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో సంజూ శాంసన్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
అదే సమయంలో అతడి ఆస్తి ఎంత అన్న దానిపై నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. పలు నివేదికల ప్రకారం 2026 నాటికి సంజూ శాంసన్ నికర ఆస్తి విలువ 85 నుంచి 100 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. ఐపీఎల్ జీతం, బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు, మ్యాచ్ ఫీజులు, ఎండార్స్మెంట్లు అతడి ఆదాయంలో ప్రధాన వనరులు.
ప్రస్తుతం అతడు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో గ్రేడ్ సిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ అతడికి ఏటా కోటీ రూపాయలు జీతంగా చెల్లిస్తుంది. దీనితో పాటు మ్యాచ్‌లు ఫీజులు అదనం. టెస్టు మ్యాచ్‌కు రూ.15లక్షలు, వన్డే మ్యాచ్‌కు రూ.6లక్షలు, టీ20మ్యాచ్‌కు రూ.3లక్షలు అందుకుంటాడు.
ఐపీఎల్ ద్వారా భారీ మొత్తం..
2025 ఐపీఎల్ సీజన్లో సంజూ శాంసన్‌కు రాజస్థాన్ రాయల్స్ రూ 18 కోట్లు జీతంగా ఇచ్చింది. ఐపీఎల్ 2026 మెగావేలం కన్నా ముందు అతడు అంతే మొత్తానికి చెన్నై సూపర్ కింగ్స్‌కు బదిలి అయ్యాడు. అంటే సీఎస్కే అతడికి ఐపీఎల్ 2026 సీజన్‌కు 18 కోట్లను జీతంగా చెల్లించనుంది.
Sunil Gavaskar : ఐసీసీపై సునీల్ గవాస్కర్ ఆగ్రహం.. ఇలాంటివి అవసరమా..
ఎండార్స్మెంట్ డీల్స్..
శాంసన్ అనేక పెద్ద బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్నాడు. జిల్లెట్, భారత్‌పే, ప్యూమా, ఎస్జీ వంటి బ్రాండ్స్ అతడి ఖాతాలో ఉన్నాయి. నివేదికల ప్రకారం అతను ఒక్కో ఒప్పందానికి దాదాపు రూ. 25-40 లక్షలు వసూలు చేస్తాడని అంటున్నారు.
లగ్జరీ కార్లు..
శాంసన్‌కు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. అతని కలెక్షన్ లో రేంజ్ రోవర్ స్పోర్ట్, BMW 5 సిరీస్, ఆడి A6, మెర్సిడెస్-బెంజ్ C-క్లాస్ వంటి మోడళ్లు ఉన్నాయి.
విలాసవంతమైన ఇల్లు..
కేరళలోని విజింబంలో శాంసన్‌కు రూ.6 కోట్లు విలువ చేసే విలాసవంతమైన ఇల్లు ఉంది. కేరళతో పాటు, బెంగళూరు, ముంబై, హైదరాబాద్‌లలో అతడికి ఆస్తులు ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ.4కోట్లుగా తెలుస్తోంది.
