Virupaksha: యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ‘విరూపాక్ష’ విశ్వరూపం.. తొలిరోజు సాలిడ్ వసూళ్లు!

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విరూపాక్ష’ సినిమాకు ఓవర్సీస్ లో తొలిరోజే సాలిడ్ వసూళ్లు లభించాయి.

Virupaksha: యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ‘విరూపాక్ష’ విశ్వరూపం.. తొలిరోజు సాలిడ్ వసూళ్లు!

Virupaksha First Day Strong Collections In Overseas

Virupaksha: సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విరూపాక్ష’ నిన్న(ఏప్రిల్ 21న) భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ దండు మిస్టిక్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించగా, ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఈ సినిమా సక్సెస్ అయ్యింది. తొలిరోజే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఈ మూవీ కలెక్షన్స్ పరంగా కూడా సత్తా చాటడం ఖాయమని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

Virupaksha: ‘విరూపాక్ష’ను రిలీజ్ చేయండి ప్లీజ్ అంటోన్న నార్త్ ఆడియెన్స్..?

ఇక ఓవర్సీస్‌లో మంచి క్రేజ్ ఉన్న సాయి ధరమ్ తేజ్‌కు విరూపాక్ష మూవీ అక్కడ కూడా మంచి రిజల్ట్‌ను అందిస్తోంది. ఈ సినిమాకు ఓవర్సీస్‌లో ప్రీమియర్లు, తొలి రోజు కలుపుకుని ఏకంగా 200K డాలర్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు యూఎస్ డిస్ట్రిబ్యూటర్ సరిగమ సినిమాస్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ జోరు మరింతగా పెరిగనుందని.. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో, ఈ కలెక్షన్లు మరింతగా ముందుకు వెళ్తాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

Virupaksha : విరూపాక్ష సక్సెస్ సెలబ్రేషన్స్.. గ్యాలరీ!

ఈ లెక్కన విరూపాక్ష మూవీ యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 1 మిలియన్ గ్రాస్ వసూళ్లను చాలా సులువుగా కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి విరూపాక్ష సినిమా ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద నిజంగానే మిలియన్ డాలర్ మూవీగా అవతరిస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో అందాల భామ సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటించింది.